సినీ నటులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది కానీ. రాజకీయ నాయకులకు సినిమాల్లో రాణించే అవకాశం ఉండదు. సినిమాల్లో మంచి ప్రేక్షకాదరణ ఉన్న ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం రాజకీయాల వైపు అడుగులేస్తున్నారా అనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈరోజు మోహన్ బాబు ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్‍బాబుతో పాటు ప్రధాని మోదీని కలిసిన వారిలో ఆయన తనయుడు విష్ణు, కుమార్తె లక్ష్మీప్రసన్న, కోడలు వెరోనికాతో కలిసి మోదీని కలిసారు.

 

 

మోదీని కలిసిన మోహన్ బాబు ప్రధానితో కలిసి అరగంటకు పైగా సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు రాజీకీయాంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే మోహన్‍బాబును ప్రధాని మోదీ బీజేపీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తోంది. రాజకీయాంశాల మీదే మోహన్ బాబు కూడా ప్రధానిని కలిసినట్టు సమాచారం. ప్రధాని మోదీతో మోహన్ బాబుకు ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలోనే అప్పటి ప్రధాని అభ్యర్ధిగా ఉన్న మోదీని కలిసారు మోహన్ బాబు. మోదీ ప్రధాని అయ్యాక కూడా మోహన్ బాబు కలిసిన విషయం తెలిసిందే.

 

 

మోహన్ బాబు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోహన్ బాబు వైఎస్ జగన్ కు పరోక్ష మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సాయంత్రం 6గంటలకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా మోహన్ బాబు కలవనున్నారని తెలుస్తోంది. సినిమాల్లో.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. సినిమా నటులకు క్రేజ్ ఎక్కువ. ప్రస్తుతం ఇద్దరు బీజేపీ అగ్ర నాయకులను మోహన్ బాబు కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: