ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు  రాజధానులపై  ఆందోళన కొనసాగుతోంది. రాజధాని అధ్యయనం  కోసం నియమించిన కమిటీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక సమర్పించడంతో అమరావతిలో నిరసనలు మరోసారి భగ్గుమన్నాయి. అయితే ఇప్పుడు వరకు రాజధాని అమరావతిని మార్చొద్దు అంటూ.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విపక్ష పార్టీలు ప్రస్తుతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంటే...  కొంతమంది టీడీపీ కీలక నేతలు మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన విషయం తెలుస్తుంది. 

 

 

 ఇకపోతే తాజాగా మరో కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు టిడిపి నేతలు. సీమ నేతలు అందరూ గ్రేటర్ రాయలసీమ తెరమీదికి తెస్తూ ప్రభుత్వం ముందుకు కొత్త డిమాండ్లను ఉంచుతున్నారు . ప్రకాశం నెల్లూరు జిల్లాల్లను  రాయలసీమలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన.. టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఇదే ప్రతిపాదన తెరమీదకు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలను  కలిపి రాయలసీమను గ్రేటర్ రాయలసీమగా  ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో కర్నూలు జిల్లాను తెలంగాణలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికైనా ఓకే రాజధాని ఉండాలని... జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన  3 రాజదానుల  నిర్ణయం సరైనది కాదు అంటూ తెలిపారు. 

 

 

 

 సీఎం జగన్  రాజధాని అధ్యయనం కోసం నియమించిన  రెండు కమిటీలు జగన్ వేసుకున్న సొంత కమిటీ లేనని జగన్ ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే జీఎన్ రావు కమిటీ.. బోస్టన్ కమిటీలు  నివేదికలు అందించాయని ఆయన ఆరోపించారు. కులాలు  ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజధాని మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు తెలుగు ప్రజలందరిని కాంగ్రెస్ పార్టీ విడగొడితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  నిర్ణయం  ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు ఆయన. రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు రావడం లేదని విశాఖను రాజధానిగా చేస్తే... ప్రజలకు రాజధాని  నిత్యం అందుబాటులో ఉండక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: