మంచు మోహన్ బాబు ఫ్యామిలి మొత్తం  బిజెపిలో చేరిందా ? అవుననే అంటోంది ఎలక్ట్రానిక్ మీడియా. సోమవారం మధ్యాహ్నం మోహన్ బాబు ఫ్యామిలి అంటే మోహన్ బాబుతో కలిపి కూతురు లక్ష్మీ మంచు, కొడుకులు విష్ణు, మనోజ్ ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా సమావేశమయ్యారు. దాంతో ఫ్యామిలి బిజెపిలో చేరిందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.

 

 

మొత్తం కుటుంబాన్ని పార్టీలో చేరాల్సిందిగా భేటి సందర్భంగా మోడి ఆహ్వానించినట్లు సమాచారం. గతంలో అంటే 2014 ఎన్నికలకు ముందు కూడా మోడి, అమిత్ షా తో మోహన్ బాబు కుంటుంబం చాలా సార్లే భేటి అయ్యింది. కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళెవరూ పార్టీలో చేరలేదు. అదే సమయంలో అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. అంటే మోహన్ బాబు-జగన్ మధ్య దగ్గర బంధుత్వం కూడా ఉంది లేండి.

 

మొన్నటి ఎన్నికల్లో పరోక్షంగా మోహన్ బాబు వైసిపికి ప్రచారం చేశారు కూడా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్ గా అయితే లేరనే  చెప్పాలి. అదే సమయంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మోహన్ బాబును జగన్ నియమించబోతున్నారంటూ పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. కానీ ఇంత వరకూ ప్రభుత్వంలో ఎటువంటి పదవి దక్కలేదు.

 

ఇటువంటి సమయంలోనే మొత్తం ఫ్యామిలితో మోహన్ బాబు ప్రధానమంత్రిని కలవటం సంచలనంగా మారింది. మరి బిజెపిలో చేరే ఉద్దేశ్యంతోనే మోడి, అమిత్ షాలను కలిశారో లేకపోతే ఏదో మర్యాద పూర్వక బేటి మాత్రమేనా అన్నది తేలాలి. కాకపోతే మొత్తం ఫ్యామిలి అంతా బిజెపిలో చేరిపోయినట్లే ప్రచారం మొదలైపోయింది.  ఏ పార్టీలో చేరినా మంచు ఫ్యామిలి వల్ల సదరు పార్టీకి వచ్చే ఉపయోగాలేమిటి ? అంటే మాత్రం ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: