అందాల పోటీలు అనగానే అందమైన భామలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వయ్యారాలు వొలకబోస్తూ, కాళ్లను, నడుమును, నాగినిలా తిప్పుతూ, వచ్చి వెళ్లుతుంటారు. ఈ పోటీలంటే దాదాపు అందరు చొంగ కార్చుకుంటూ చూస్తారు. కానీ ఈ అందాల పోటీలు ఒక అందమైన భామలకే కాదండోయ్, జంతువులకు కూడా పెడుతారని తెలుసా. ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకున్న జంతువులు కూడా ఉన్నాయి.

 

 

ఇకపోతే ఏనుగులకు అందాల పోటీలు పెడతారని మీకూ తెలుసా. కనీసం ఎప్పుడైనా విన్నారా.. లేదంటారా. మరి గున్నకు గున్నలా అధిక బరువుతో ఉన్న ఏనుగులకు అందాల పోటీలు ఏంటని వెటకారం చేస్తున్నారా.. ఆ ఆలోచనల్లోకి వెళ్లకండి. ఎందుకంటే ఏనుగుకు కోపం వచ్చిందంటే, తొండంతో ఒక్కటి ఇచ్చుకుంటే, కాశ్మీర్, కన్యాకుమారి అందాలన్ని కళ్లకు కనిపిస్తాయి. ఇకపోతే ఏనుగులకు కూడా అందాల పోటీలు పెట్టారట. అదెక్కడంటే. నేపాల్‌లోని సౌరహా లో ప్రతీ ఏటా ఎలిఫ్యాంట్ ఫెస్టివల్‌ సందర్భంగా ఏనుగులకు అందాల పోటీలు నిర్వహిస్తారు.

 

 

ఇలా ఇప్పటి వరకు దీనితో కలిపి 16వ ఎలిఫ్యాంట్ ఫెస్టివల్ జరిగాయట..  ఇకపోతే 16వ ఎలిఫ్యాంట్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వాహకులు ఏనుగులకు అందాల పోటీలు నిర్వహించగా, ఇందులో మొత్తం ఐదు ఏనుగులు పాల్గొని, వయ్యారంగా ర్యాంప్ వాక్ చేసి జడ్జ్‌లను ఆకట్టుకున్నాయట. ఈ వేడుక చూసేందుకు వందలాది మంది పర్యాటకులు విచ్చేశారు. ఇందులో విజేతగా నిలిచే ఏనుగుకు చెరకు, అరటి పండ్లు, బొప్పయి వంటి రుచికరమైన ఆహారాన్ని బహుమతిగా అందిస్తారట.

 

 

ఏనుగులకు, మనుషులకు ఉండే అనుబంధాన్ని తెలిపేందుకు, ఏనుగుల జాతిని కాపాడాలనే సందేశాన్ని తెలిపేందుకు ఇలా ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తారని, ఈ ఏనుగుల అందాల పోటీలను నిర్వహించే నిర్వాహకులు తెలిపారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి ప్రాణి అద్భుతమైందే, అందమైందే. కానీ ఆ అందాలను చూసే మనుసు మనుషులకు లేదు కాబట్టి  అవి వాటి ఆకారలతో కనబడుతాయి. ఇక ఇప్పుడు ఈ ఏనుగుల అందాల పోటీల వీడియో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతుందట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: