పౌరసత్వ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రావడంతో దేశంలో అలజడులు జరుగుతున్నాయి.  ప్రతిపక్షాలు ఈ అలజడుల్లో భాగస్వామ్యం అవుతూ... కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి. విద్యార్థులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.  ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం తెలియడం లేదు.  

 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టంలో వలన భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేవు.  కేవలం ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చిన ముస్లింలను మాత్రమే గుర్తించి వారిని వారి దేశాలకు పంపించడమే ఈ బిల్లు లక్ష్యం.  అందుకే ఈ బిల్లును తీసుకొచ్చారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావాలని అనుకుంది.  కానీ, కుదరలేదు.  దానిని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.  

 

 


ఇలా బిల్లును తీసుకురావడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేంద్రం చెప్తున్నా వినడం లేదు.  పైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ రగడ సృష్టిస్తున్నారు.  ఢిల్లీలోని జెఎన్యూలో కొన్ని రోజులుగా ఈ రగడ జరుగుతూనే ఉన్నది.  అయితే, నిన్నటి రోజున కొంతమంది ముసుగులు ధరించిన వ్యక్తులు యూనివర్సిటీలోకి ప్రవేశించి హాస్టల్ లోకి దూరి కొందరిపై దాడులు చేశారు.  ఈ దాడుల్లో 29 మందికి గాయాలయ్యాయి.

 

 


దీనిపై మజ్లీస్ పార్టీ నేత ఒవైసి విరుచుకుపడ్డారు.  ఈ చర్యను ఖండించారు.  విద్యార్ధులపై దాడులు చేయడం అమానుషం అని అన్నారు.  దాడులను ఖండించిన ఒవైసి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  ఈ విషయంలో కేంద్రం చేతులు ఎత్తెయ్యడం విచారకరం అని అన్నారు.  గూండాలతో కలిసి పోలీసులు ఎందుకున్నారో మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. మరి దీనికి కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: