చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కారును నిన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవటంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ వర్గాలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో రోజాపై జగన్ సీరియస్ అయినట్లు చెబుతున్నాయి. కానీ రోజా మాత్రం ఇది కావాలని చేసిన దాడి కాదని ఈ దాడి వెనుక కుట్ర ఉందని తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. 
 
చిత్తూరు జిల్లా రాజకీయాల్లోని కీలక వ్యక్తులే ఈ దాడి వెనుక ఉన్నారని ఎన్నికల సమయంలోనే తనను ఓడించాలని కొందరు ప్రయత్నాలు చేశారని ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో తనపై ప్లాన్ చేసి మరీ దాడి చేశారని రోజా చెబుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ పార్టీ శ్రేణులు పెద్దిరెడ్డి వర్గంపైనే రోజా అనుమానాలు వ్యక్తం చేస్తోందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వారే ఇప్పుడు దాడికి ప్రణాళిక రచించారని రోజా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఓటమికి ప్రయత్నించారని ఇప్పుడు దాడికి కూడా పెద్దిరెడ్డే కారణమై ఉండొచ్చని రోజా జగన్ కు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రోజాకు కేబినేట్ లో చోటు దక్కకపోవడానికి కూడా పెద్దిరెడ్డి కారణమని పార్టీలోని కొందరు చెప్పుకుంటున్నారు. సీఎం జగన్ రోజాకు కేబినేట్ లో చోటు కల్పించకపోయినా ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 
 
వచ్చే కేబినేట్ లో రోజాకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు కూడా పెద్దిరెడ్డి, రోజా మధ్య ఉన్న విభేదాలు ఈ దాడితో బహిర్గతమయ్యాయని అభిప్రాయపడుతున్నారు. రోజా అతి త్వరలో సీఎం జగన్ ను కలిసి తనపై జిల్లాలో జరుగుతున్న కుట్రలను జగన్ కు తెలియజేయాలని భావిస్తున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: