ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రాజధాని అమరావతి లో తీవ్ర స్థాయిలో నిరసన వెల్లువెత్తుతుంది అన్న  విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే 3 రాజదానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు సహా కుటుంబం మొత్తం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని రైతుల నిరసనతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. అయితే అటు రాజధాని అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు జగన్మోహన్ రెడ్డి  3 రాజధానిల  నిర్మాణానికి సమర్థిస్తున్నట్లు ఉండటంతో అమరావతి రైతులు నిరసన మరింత ఉధృతం చేశారు. ఇకపోతే అమరావతి రైతుల నిరసన కు టిడిపి నేతలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రైతుల నిరసన కు మద్దతు తెలుపుతూ తన రెండు బంగారు గాజులను  విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే భువనేశ్వరి తీరుపై  వైసీపీ నేతల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఇక తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేతిలో భువనేశ్వరి రాజకీయ పావుగా మారి పోయారు అంటూ ఆరోపించారు ఎమ్మెల్యే రోజా. తండ్రి ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు. నాడు తన తండ్రిపై కట్టుకున్న భర్తే చెప్పులు వేస్తుంటే భువనేశ్వరి ఎందుకు బయటికి రాలేదు అంటూ నగరి ఎమ్మెల్యే రోజా నిలదీశారు. 

 

 

 ఎన్టీఆర్ ఆనాడు బలనిరూపణ చేసుకోలేక పదవి కోల్పోయి అసెంబ్లీ నుంచి కంటతడి పెట్టుకుంటూ వెళ్తుంటే భువనేశ్వరి తండ్రిని ఎందుకు పరామర్శించిన లేదు అంటూ నిలదీశారు నగరి ఎమ్మెల్యే రోజా. తోబుట్టువులైన పురంధేశ్వరి హరికృష్ణ ను పార్టీ నుంచి గెంటేసినంత  పని చేసినప్పటికీ కూడా భువనేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు... అలాంటి భువనేశ్వరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అంటూ రోజా ప్రశ్నించారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం స్కూల్ పిల్లలు హుండీలు ఏర్పాటు చేస్తే భువనేశ్వరి కానీ ఆమె కోడలు కానీ ఒక రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు అంటూ రోజా విమర్శలు గుప్పించారు.ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ రెండు గాజులు విరాళం ఇస్తే ఎలా నమ్మాలి రైతులు అడుగుతున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: