సమాజంలో బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి. చేసే పని గౌరవంగా ఉండాలనేది ఒకప్పటి భావన. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత సంపాదిస్తున్నాం, అందులోనుండి ఎంత ఖర్చు పెడుతున్నాం అని ఆలోచిస్తున్నారు.. అంతే కాకుండా లగ్జరీగా బ్రతకడానికి అలవాటు పడిన మనుషులు అందుకోసం ఏం చేస్తున్నామన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇక అడ్దదారుల్లో పెద్ద మొత్తంగా సంపాదించే మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో వ్యభిచారం కూడా ఒకటి.

 

 

ముఖ్యంగా ఒకరకమైన జల్సాలకు అలవాటు పడిన అమ్మాయిలు, సినిమారంగంలో కానివ్వండి, బుల్లితెర నటీమణులు కానివ్వండి, లేదా కాలేజీల్లో చదివే వారు కానీ, తమ అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో లేక ఇలాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇక సిని తారలైతే పదిమందిలో ఆకర్షణీయంగా కనబడాలి. అందుకు వారికి ఒక్కోసారి సినిమా అవకాశాలు ఉండవు. అప్పుడు తమ ఖర్చులను బ్యాలన్స్ చేయాలంటే బ్రోకర్ల వలలో పడి వ్యభిచారాలకు ఒప్పుకుంటున్నారట. ఇది దాదాపు అన్ని చోట్ల జరుగుతుంది.

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సెక్స్ రాకెట్‌ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇక తాజాగా శనివారం ముంబయిలోని జుహు ప్రాంతంలో గల ఓ లగ్జరీ హోటల్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిప్ 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

 

 

వీరందనరినీ యాక్టింగ్, మోడలింగ్ పేరుతో ముంబయికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రైడింగ్‌లో పట్టుబడిన యువతులు పలు హిందీ ఛానల్స్‌లోని సీరియల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో నటిస్తున్నారని జుహు పోలీస్‌స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ పంధారినాథ్ వావల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే ఐదుగురు బ్రోకర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: