మూడో ప్రపంచ యుద్దానికి దారులు తెరుచుకుంటున్నాయా అంటే అవుననే అంటున్నారు.  ఇప్పటికే ప్రపంచం రెండు యుద్దాలు చూసింది.  మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పెద్దగా మందుగుండు సామగ్రి అందుబాటులో లేదు కాబట్టి పెద్దగా నష్టం సంభవించలేదు.  కానీ, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు అందుబాటులో ఉన్నా అవి కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి.  అయితే, ఆ కొన్ని దేశాలు కూడా వీటిని వినియోగించలేదు.  


కానీ, ఇపుడు ప్రపంచంలో సగానికిపైగా దేశాల్లో అణుబాంబులు ఉన్నాయి.  చాలా దేశాలు బయటకు చెప్పకుండా సైలెంట్ గా అణుబాంబులు తయారు చేసుకుంటున్నాయి.  ఒకవేళ ఇప్పుడు ప్రపంచ యుద్ధం వస్తే అది భూవినాశనమే అవుతుంది తప్పా మాములు యుద్ధం కాజాలదు.  ఎవరైనా ఒక్కరు అణుబాంబును ప్రయోగిస్తే చాలు... ప్రపంచం మొత్తం కూడా అణ్వాయుధాలు బయటకు తీస్తుంది.  క్షణాల్లోనే వినాశనం సంభవిస్తుంది.  


అందుకే అలా జరగకూడదు అనే కోరుకుంటున్నారు.  కానీ, అమెరికా అనుసరిస్తున్న విధానాల వలన గల్ఫ్ లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొనడంతో పాటు ఇరాక్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది.  ఇరాక్ లో ఉన్న అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని, తమ భూభాగంలో ఉండేందుకు వీలులేదని అంటున్నారు.  అలా తిరిగి వెళ్లేందుకు తగిన సమయం ఇచ్చింది.  


కానీ,అమెరికా మాత్రం దానికి ససేమిరా అంటోంది.  మిలియన్ డాలర్లు అక్కడ ఖర్చు చేశామని, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఆ డబ్బు ఇరాక్ చెల్లించాలని అంటోంది.  పైగా ఇరాన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జంకారా మసీద్ పై ఎర్రజెండా ఎగరవేసింది.  దీని అర్ధం ఏంటో అందరికి తెలుసు.  యుద్ధం రాబోతున్నది అన్న దానికి సంకేతంగా ఈ జెండాను ఎగురవేస్తారు.  ఇరాన్ లో మసీద్ పై ఈ జెండా ఎగరవేయడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ఏక్షణంలో యుద్ధం వస్తుందో అని భయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: