గడచిన మూడు నెలలుగా ఆస్ట్రేలియా అడవులు తగలబడుతున్న విషయం తెలిసిందే. ఈ మంటలలో దాదాపు 50 కోట్ల వన్యప్రాణులు మృతి చెందగా కోటిన్నర ఎకరాల అడవి దగ్ధమైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ మంటలను ఆర్పేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. కానీ ఈ మంటలు ఆర్పడానికి ఇంకా కొన్ని వారాల సమయం పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. 
 
అస్ట్రేలియా అడవులలోని మూగజీవాల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో వన్యప్రాణులు మంటల్లో చిక్కుకొన్న వీడియోలు వైరల్ అవుతూ ఉండటంతో నెటిజన్లు కoటతడి పెడుతున్నారు. ఎంతో మంది జాలి హృదయం కలిగినవారు ఈ ఘటనపై స్పందించి తమకు వీలైనంత సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన కేలాన్ వార్డ్ అనే యువతి చందాలు స్వీకరించటానికి ముందుకు వచ్చింది. 
 
చందాలు సేకరించడంలో ఆశ్చర్యమేముంది అని అందరూ అనుకోవచ్చు కానీ ఆమె చందాల కోసం ఎంచుకున్న దారి వలన ఈమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో కేలాన్ వార్డ్ ఎవరైతే తనకు చందాలు ఇస్తారో వారికి తన నగ్న చిత్రాలను పంపిస్తానని క్యాంపెయిన్ ప్రారంభించింది. కానీ చందాలు ఇచ్చేవారికి ఒకే ఒక షరతును విధించింది. 
 
చందాలు ఇచ్చేవారు ఎవరైనా కనీసం 10 డాలర్లు చందా ఇవ్వాలని కేలాన్ వార్డ్ ప్రకటన చేసింది. యువతి చేసిన ఈ ప్రకటన వైరల్ అయింది. రెండు రోజుల్లో దాదాపు 5 కోట్ల రూపాయలు కేలాన్ వార్డ్ కు చందాల రూపంలో వచ్చాయి. కానీ ఈ విషయం ఇన్ స్టాగ్రామ్ సంస్థ గుర్తించటంతో వెంటనే కేలాన్ వార్డ్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. లక్ష్యం ఉన్నతమైనదైనప్పటికీ ఆమె ఎంచుకున్న దారిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కుటుంబానికి దూరం పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: