ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. సాధారణంగా ఏప్రిల్‌ మొదటి వారంలో ఐటీఆర్‌ ఫారాలు ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4లను ఐటీ శాఖ నోటిఫై చేస్తుంది. కానీ ఈసారి జనవరి మొదటి వారంలోనే చేసింది. ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం 2020-21 మదింపు సంవత్సరం (2019-20 ఆదాయ సంవత్సరం) కోసం పన్ను రిటర్న్‌ ఫారాలను నోటిఫై చేసింది. 

 

ఐటీ ఫారాల్లో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో ఏటా రూ.లక్ష కరెంట్‌ బిల్లులు కట్టేవారు, విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షలు ఖర్చుచేసేవారు, ఉమ్మడి గృహాస్తిగలవారు ఇకపై సాధారణ ఐటీఆర్‌-1 ఫారంలో తమ వార్షిక ఆదాయాన్ని దాఖలు పరుచలేరు. దీని ప్రకారం ఐటీఆర్‌ ఫారాల్లో రెండు భారీ సవరణల్ని తీసుకొచ్చింది. ఒకటి.. హౌజ్‌ ప్రాపర్టీ (ఇల్లు లేదా నివాసానికి యోగ్యమైన ఆస్తి)లో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందితో సంయుక్త యజమాని (జాయింట్‌ ఓనర్‌)గా ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌-1 లేదా ఐటీఆర్‌-4 ఫారాలను ఐటీ రిటర్నుల కోసం వాడరాదు.

 

రెండోది.. బ్యాంక్‌ ఖాతాల్లో రూ.కోటికిపైగా డిపాజిట్‌ చేసినవారు, విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు, విద్యుత్‌ బిల్లుల కోసం రూ.లక్ష చెల్లిస్తున్నవారికి ఐటీఆర్‌-1 ఫారం చెల్లదు. వీరికి వేరే ఫారాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఐటీఆర్‌-1 సహజ్‌లో రిటర్నులను కేవలం సాధారణ గృహస్తులే దాఖలు చేయాల్సి ఉంటుంది. వీరి వార్షిక ఆదాయం రూ.50 లక్షలు మించరాదు. ఇక ఐటీఆర్‌-4 సుగమ్‌లో రిటర్నులను రూ.50 లక్షల వరకు ఆదాయమున్న రెసిడెంట్‌ ఇండివిడ్యువల్స్‌, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు దాఖలు చేయవచ్చు. 

 

వ్యక్తిగత, సంస్థాగత, కంపెనీల పరంగా 2018-19లో వచ్చిన ఆదాయ ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను సమర్పించాలి. వ్యక్తిగతంగా జీతభత్యాలు, ఒక ఇంటి ఆస్తి, రూ.5వేలకంటే అధికంగా వ్యవసాయ రాబడి, వడ్డీల ద్వారా మొత్తం వార్షికాదాయం రూ.50 లక్షలకు లోబడిన వారు ఐటీఆర్-1, వ్యాపారం లేదా వృత్తికి సంబంధించిన ఆదాయాలు లేనివారు ఐటీఆర్-2, వ్యక్తిగత, వాణిజ్యం, వృ త్తి వంటి ఆదాయాలుంటే ఐటీఆర్-3ని సమర్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: