ఈమధ్య రోజురోజుకు ఆటో చార్జీలు భారీగా పెరిగిపోతున్నాయన్న  విషయం తెలిసిందే. కొంచెం దూరం ప్రయాణిస్తే చాలు ఆటో వాళ్లకి భారీగా ముట్ట చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆటో వాళ్ళు వేసే మీటర్ అయితే ఆడి కారు కన్నా స్పీడుగా పరిగెడుతూ ఉంటుంది.. దీంతో ఆటోలో  కూర్చున్న ప్రయాణికుల గుండె కూడా 100 స్పీడులో కొట్టుకుంటూ ఉంటుంది ఆటో  మీటర్ ని చూస్తూ ఉంటే . కొంతమంది ఆటో వాళ్ళు తగిన మోతాదులోనే ఛార్జీలు వసూలు చేస్తుంటే.. కొంతమంది మాత్రం భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అధిక ఛార్జీలతో ఆటోలో ఎక్కాలంటే ప్రయాణికులు బెంబేలెత్తి పోతుంటారు. కొంచెం దూరం వెళ్లాలన్న వందలకు వందలు వసూలు చేస్తుంటారు ఆటో వాళ్ళు. 

 

 

 అయితే ఆటో చార్జీలు తగ్గి  తక్కువ ధరకే ఆటోలో ప్రయాణించే వెసులుబాటు ఉంటే బాగుండు అని అనుకొని ప్రయాణికుడు లేడంటే  అతిశయోక్తి కాదు. కానీ ఏం లాభం ఆటో చార్జీలు తగ్గడం అంటే పగటి కలలు కనడమే కదా. ఎందుకంటే రోజురోజుకు ఆటో చార్జీలు పెరిగిపోతాయి కానీ తగ్గడం మాత్రం జరగదు. ఇంకేం చేస్తాం తప్పక భారీ ఛార్జీలు చెల్లించి ఆటోలో ప్రయాణించక తప్పదు అనుకుంటూ  ఉంటారు  ప్రయాణికులు కూడా. అయితే ఇక్కడ ప్రయాణికుల ఇబ్బందులను అర్థం చేసుకున్న వ్యాపారి... కేవలం ఐదు రూపాయలకే ఆటో సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ  వ్యాపారి 5రూపాయలకి సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులందరూ ఈ ఆటోలో ప్రయాణించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 

 

 

 రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కు చెందిన వ్యాపారి నాగుల నరేందర్ దంపతులు.. కేవలం ఐదు రూపాయలకి ఈ ఆటోల సేవలు అందిస్తున్నారు. బండ్లగూడ జామీర్ గ్రామస్తులు.. వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గణపతి ఎక్స్ప్రెస్ యాప్ ద్వారా ప్రజలను ఆటోలో గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. అదికూడా ప్రయాణికులు డబ్బులు ఇస్తే ఐదు రూపాయలు తీసుకుంటారు లేకపోతే మొత్తం తీసుకోరు. ఈ ఆటోలలో కెమెరా సౌకర్యంతో పాటు జిపిఎస్ సౌకర్యం కూడా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: