జగన్మోహన్ రెడ్డిని ఎల్లోమీడియా బ్లాక్ మెయిల్ చేస్తోందా ?  ఏబిఎన్-ఆంధ్రజ్యోతిలో వస్తున్న రోత రాతలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాజధాని అమరావతి నుండి తరలిపోకుండా చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.   ఎంతగా ఆందోళన చేస్తున్నా వర్కవుటవుతున్నట్లు కనబడలేదేమో. అందుకనే చివరకు బ్లాక్ మెయిల్ కు దిగినట్లు అనిపిస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం  ఆంధ్రజ్యోతి మొదటిపేజీలో ఓ పిచ్చి కథనం అచ్చేశారు. అదేమిటంటే రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం తరలించాలని జగన్ ప్రయత్నిస్తే రైతులకు సుమారు రూ. 74 వేల కోట్లు నష్టపరిహారం చెల్లించాలట. ఎల్లోమీడియా ఎండి రాధాకృష్ణ రూ. 74 వేల కోట్లంటే కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఏకంగా రూ. 1.5 కోట్లంటున్న విషయం గమనించాలి. అంటే అందరూ కూడబలుక్కునే జగన్ ను బ్లాక్ మెయిల్ కు దిగినట్లు అనుమానంగా ఉంది.

 

అసలు సంగతేమిటంటే రాజధానిని అమరావతి నుండి తరలించినా జగన్ ఎవరికీ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదట. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి సేకరించిన భూమిని డెవలప్ చేస్తానని చెప్పి చంద్రబాబునాయుడు ఫెయిలయ్యారు. అదే భూమిని ఇపుడు జగన్ అభివృద్ధి చేసి చూపిస్తారు. నిజంగానే రాజధాని నిర్మాణాలు చేపట్టినా రైతులకు వాళ్ళకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసే ఇస్తారు.

 

అదే విధంగా జగన్ ఇపుడు రైతుల భూములను స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (ఎస్ఏజడ్)ను ఏర్పాటు చేసి రకరకాలుగా డెవలప్ చేస్తారు. కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన ఏడాది కౌలు ఎలాగూ ఇస్తునే ఉంటారు.  రాజధాని నిర్మాణంతో రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు. రాజధాని అమరావతిలో ఉన్నా విశాఖకు తరలి వెళ్ళిపోయినా రైతులకు ఒకటే.

 

కాబట్టి ఎల్లోమీడియా చెప్పినట్లుగా రాజధాని విశాఖపట్నంకు వెళ్ళిపోయినంత మాత్రాన రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరమే లేదు. అసలు నష్టపరిహారం చెల్లింపు విషయంలో  రైతులతో అప్పటి ప్రభుత్వం  చేసుకున్న అగ్రిమెంటే సరిగా లేదని సమాచారం. ఈ విషయాలు తెలిసే జగన్ ను రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ కు దిగినట్లు సమాచారం. ఇటువంటి బ్లాక్ మెయిల్ కు జగన్ లొంగే రకమేనా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: