హాజీపూర్‌ శ్రావణి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినది ఈ కేసు లో ప్రాసిక్యూషన్‌ వాదనలు సోమవారం నాటికి ముగిశాయి. ఫోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్‌ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. అన్ని విధాలుగా  నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్షకు అర్హుడుని అన్నారు. 

 

చిన్న పిల్లలపై అతి దారుణంగా వ్యవహరించిన వారిపై ఎటువంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని కోర్టును తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది అరుదైన కేసుగా పరిగణించాలని న్యాయస్థానానికి ఆయన  విజ్ఞప్తి చేశారు.  ఒంటరి మహిళలపై గతంలోనూ ఈ  నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్టు రుజువైందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

 

‘ఈ కేసును అరుదైన కేసుల్లో అరుదైనదిగా భావించాలి. అత్యంత పాశవికంగా, అభం శుభం తెలియని బాలికలను అత్యాచారం చేసి అతి కృరంగా హత్య చేసిన ఈ నీచుడిని వదలకూడదని సుప్రీం కోర్ట్ కి తెలియజేసారు . ఇటువంటి కేసుల్లో ఉరిశిక్షనే సరైనదేనని సుప్రీంకోర్టు పలు కేసుల్లో స్పష్ఠం చేసింది. నిందితుడికి బాగా నేరచరిత్ర ఉంది.  ఒక మహిళపై  కర్నూలులో లైంగిక వాంఛ తీర్చుకొని హత్య చేశాడు. కేవలం తన వాంచ తీర్చుకోవడం కోసం వారిని హత్యాలు చేస్తున్నాడు.

 

 ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది కేవలం ఒక కేసుగా చూడకూడదు. సమాజానికి పట్టిన ఒక రుగ్మతగా పరిగణించాలి. సహజన్యాయం ప్రకారం చూసినా, లాజికల్ గా చూసినా నిందితుడికి ఉరిశిక్ష సబబే. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ఉరిశిక్ష వేయాల్సిందే’ అని వాదించారు. కాగా హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సం బంధమూ లేదని పోలీసులే నన్ను ఇరికించారని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇదివరకే న్యాయమూర్తి ఎదుట చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై త్వరలోనే కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: