విమాన ప్రయాణం అంటేనే కొందరికి భయం. ఎందుకంటే మనుషులు చేసే ప్రయాణాల్లో విమాన ప్రయాణం అంటే ఆ ఇది వేరని చెప్పవచ్చు. కొందరు ఇప్పటికి తమకు ఉన్న భయం వల్ల తమ జీవితకాలంలో విమాన ప్రయాణాన్ని  చేయకూడదని నిశ్చయించుకున్న వారు కూడా ఉంటారు. ఇకపోతే ఈ ప్రయాణం సురక్షితం అని చెప్పలేము. అలాగని సురక్షితం కాదని చెప్పలేము. నిజం మట్లాడాలంటే గాల్లో చేసే ప్రయాణం గాల్లో పెట్టిన దీపం వంటింది.

 

 

ఒక్కోసారి క్షేమంగా భూమిమీదికి ల్యాండ్ అవుతున్నాం అని ఊపిరి పీల్చుకునే అంతలోనే ఏదైన జరగవచ్చూ. ఎందుకంటే ఒక్కోసారి అనుకోకుండా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే కనీసం మరణించిన వారి ముఖాలు కూడా చూడటానికి వీలుండదు. ఇదే కాకుండా అసలు మరణించిన వారి ఆచూకి కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇవన్ని తెలిసిన విమాన ప్రయాణం అంటే ఆసక్తి చూపించే వారు ఎక్కువగానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే సమయం ఆదా. ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే తప్పనిసరి. అందుకని భయపడుతూ కూర్చోరు కదా. ఇకపోతే ఇప్పుడు జరిగిన ఓ ఘటన చూస్తే మళ్లీ లేని భయం పుడుతుంది.

 

 

నిజంగా ఈ విమానంలో ప్రయాణించే వారంత అదృష్ట వంతులని చెప్పవచ్చూ. ఎందుకంటే ఎయిర్ కెనడాడకు చెందిన ఓ విమానం కెనడాలోని ట్రుడ్యూ విమానాశ్రయం నుంచి 49 మంది ప్రయాణికులతో బాగోట్విల్లేకు బయల్దేరిన  విమానం టేకాఫ్ కాగానే.. ఎడమ వైపు రెక్కకు ఉన్న టైర్ల నుంచి మంటలు వచ్చాయి. అనంతరం ఒక టైరు ఊడిపోయి కిందపడిపోయింది.

 

 

దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా కిందికి దించాడు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు... చూశారా ఈ భూమి మీద ఇంకా నూకలు బాకీ ఉన్నాయి కాబట్టి అందరు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇకపోతే ఈ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: