ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఎర్త్ పెట్టటానికి  జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన నవర్నాల పథకాల్లో ’అమ్మఒడి’ పథకం కూడా చాలా కీలకమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9వ తేదీన ప్రారంభమయ్యే పథకాన్ని జగన్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నారు.

 

కుప్పం నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యతను ప్రత్యేకించి ఎవరికీ విడమరచి చెప్పనక్కర్లేదు. గడచిన 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఓటమన్నదే లేకుండా గెలుస్తున్న నియోజకవర్గం ఇది. ఇటువంటి నియోజకవర్గంపై జగన్  తన దృష్టిని పెట్టారు. ప్రభుత్వ పథకాల్లో వీలైనంత ఎక్కువగా ఈ నియోజకవర్గంలో అమల్లోకి తీసుకురావటం ద్వారా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిగొట్టాలన్నది జగన్ టార్గెట్. చంద్రబాబు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడన్నదే కానీ జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదన్నది వాస్తవం.

 

అసలు మొన్నటి ఎన్నికల్లోనే చంద్రబాబును ఓడించాలని అనుకున్నా సాధ్యం కాలేదు. కాకపోతే మొదటి మూడు రౌండ్లలో మాత్రం వైసిపి అభ్యర్ధి చంద్రమౌళికి మెజారిటి రావటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా ఎప్పుడూ జరిగేదేమిటంటే కుప్పంలో ఎప్పుడు ఓట్లు లెక్కపెట్టినా చంద్రబాబుకు మొదటి రౌండ్ నుండే వేలాది ఓట్ల మెజారిటి ఉండేది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో మొదటి మూడు రౌండ్లలో  వైసిపికి మెజారిటి వచ్చిందంటే మామూలు విషయం కాదు.

 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే చంద్రబాబును ఓడించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకనే ప్రభుత్వ పథకాలను ఇక్కడ వీలైనంత మందికి అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పైగా ఈ నియోజకవర్గంలో బిసిలు ఎక్కువ. బిసిలతో పాటు ఇతర సామాజికవర్గాలను ఆకట్టుకునేట్లుగా జగన్ ప్లాన్ వేశారు.

 

ప్లాన్ మొత్తాన్ని అమలు చేయటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి  ప్రత్యేకంగా బాధ్యతులు  అప్పగించారు. అందుకనే పెద్దిరెడ్డికి కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మక పథకం ప్రారంభానికి కుప్పాన్ని ఎంచుకున్నారు. మరి జగన్ ప్రతయ్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: