మొత్తానికి తాను తవ్విన గోతిలో చంద్రబాబునాయుడే ఇరుక్కుపోయాడు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి  ఏవేవో పిచ్చి లెక్కలేసి, గ్రాఫిక్కులతో మాయాబజారును సృష్టించి జనాలు పిచ్చోళ్ళను చేద్దామని అనుకున్నారు. తీరా చూస్తే ఇపుడు ఆయనే మాయాబజారులో ఇరుక్కుపోయారు. అందుకనే లాజిక్ లేకుండా రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారు.

 

అప్పట్లో రాజధాని ప్రాంతంలో మౌళిక సదుపాయాల కల్పనకే కనీసం రూ. 1.10 లక్షల కోట్లు అవుతుందని చంద్రబాబే చెప్పారు. మౌళిక సదుపాయాలకే లక్ష కోట్లయితే ఇక చంద్రబాబు చెప్పినట్లుగా నవనగరాల నిర్మాణానికి ఇంకెన్ని లక్షల కోట్లు కావాలి ?  అదే విషయాన్ని ఇపుడు వైసిపి నేతలు అడుగుతుంటే చంద్రబాబు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. గతంలో తాను చెప్పిన లెక్కలను ఇపుడు  చంద్రబాబే  తప్పంటున్నారు.

 

సరే  ఈ విషయాలను పక్కనపెడితే అమరావతిలో భవనాల కోసం జగన్ ఒక్కరూపాయి కూడా ఖర్చుపెట్టకపోయినా సరిపోతుందని చంద్రబాబు అంటున్నారు. బాగానే ఉంది మరి రైతుల నుండి తీసుకున్న వేలాది ఎకరాలను ఏం చేసుకోవాలి ? ఈ ప్రశ్నకు చంద్రబాబు కానీ రైతులు కానీ సమాధానం చెప్పటం లేదు. అందుకనే బాగా అభివృద్ధి చెందిన విశాఖపట్నంకు తరలి వెళ్ళిపోతే  భవనాలపై పెద్దగా పెట్టుబడి అవసరం లేదని వైసిపి అంటోంది.

 

వైసిపి వాదన కరెక్టే అని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ మరి అమరావతి ప్రాంతంలో తన మద్దతుదారులో టిడిపి ప్రముఖులో కొనేసిన వేలాది ఎకరాల మాటేమిటి ? ఇక్కడే భూములు కొన్నవారంతా తమ ప్రయోజనాల కోసమైనా పోరాటాలు చేయాలంటూ చంద్రబాబుపై  ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. రియల్ ఎస్టేట్ విలువల కోసమే తాను పోరాటం చేస్తున్నట్లు ఉండకూడదనే చంద్రబాబు అవస్తలు పడుతున్నారు.

 

ఇందులో భాగంగానే రైతుల సెంటిమెంటు అంటూ ఓ కట్టుకతను ముందు పెట్టారు. ఎల్లోమీడియా, సుజనా చౌదరి చెప్పినట్లుగా రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం  ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (ఎస్ఏజడ్)పెట్టి రైతుల భూములను అభివృద్ధి చేసేట్లయితే రైతులకు నష్టపరిహారం ఇవ్వక్కర్లేదని చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఏ విషయంపైన కూడా గట్టిగా మాట్లాడలేక కేవలం రైతులను మాత్రమే రెచ్చగొడుతు పబ్బం గడుపుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: