సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా జరుపుకుంటారు ప్రజలు. సంక్రాంతి సందడి మామూలుగా ఉండదు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు  వెళ్లిన వారు అందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఇళ్లకు చేరుకుని సందడి చేస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి సందడి అయితే మామూలుగా ఉండదు. ఇక సంక్రాంతి పండుగ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది గాలిపటాలు. సంక్రాంతి నాడే కాదు సంక్రాంతి ముందు నెల రోజుల ముందు నుంచే గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక గాలిపటాలు ఎగురవేయడం లో చిన్నపిల్లల దగ్గర నుంచి యువత పెద్దలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. 

 


 అయితే గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పోటీలలో గెలిచేందుకు ఎంతోమంది వివిధ రసాయనాలతో దారాలు తయారు చేస్తూ ఉంటారు. ఈ వీర రసాయనిక  దారాలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు హాని చేసే రసాయనాలతో ఈ దారాలు తయారీ జరుగుతుందని అంతేకాకుండా.. అంతేకాకుండా ఈ దారాల  వల్ల చెయ్యి  తెగిపోయే ప్రమాదం కూడా వుంది అంటూ నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా నే... గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు.  దీంతో కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. 

 

 అయితే ఇక్కడ గాలిపటం దారం ఒక ప్రాణం తీసింది. గుంటూరు లో విషాద ఘటన చోటుచేసుకుంది. సంగడిగుంట లో తండ్రితో కలిసి బైక్పై వెళ్తున్న ఐదేళ్ల బాలుడు మెడకు గాలిపటం ఎగరేసేందుకు  ప్రత్యేకంగా తయారు చేసిన మాంజా.. బాలుడు మెడకు చుట్టుకుంది. దీంతో ఆ బాలుడు మేడం భాగంలో తెగి రక్తస్రావం అవుతూ ఉండడంతో వెంటనే ఆ బాలుని... జిజిహెచ్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ బాలుడు. సంక్రాంతి పండుగ వేళ చిన్న పెద్ద అందరూ కలిసి పతంగులు ఎగుర వేస్తూ ఉంటారు. కానీ పతంగి ఎగరవేయడానికి చైనా మాంజా వాడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: