యాహూ...ఒకప్పుడు సెర్చ్‌ ఇంజిన్‌గా, ఈమెయిల్‌గా క్రేజ్‌ సంపాదించింది.  జీమెయిల్‌, అవుట్‌లుక్‌ వంటివి ముందుపీఠిన నిలవడంతో పోటీని తట్టుకోలేక క్రమంగా వెనకబడిపోయింది. అయితే, పూర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకునే ప్రయంలో యాహూ ఉంది. ‘యాహూ’ ఇప్పుడు కొత్త రూపుదిద్దుకుంది. సమీప పోటీదారులకు మించిన ఫీచర్లతో అభివృద్ధి చెందింది. గతంలో విశిష్ఠ ఆదరణ పొందినట్టుగా ఇప్పుడు యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను రీబ్రాండింగ్ చేసింది.

 

పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్‌, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, సర్వీసులతో రీబ్రాండ్‌ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంటికి ఇంపైన రంగులతో ఈ యాప్స్‌ను తాజాకరించింది. ఈమెయిల్‌లో 1టీబీ ఉచిత స్టోరేజీ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజా యాహూ మెయిల్‌ యాప్‌ను 7 మిలియన్ల యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 4.5 స్టార్‌ రేటింగ్‌ను పొందింది.

 

ప్రస్తుతానికి యాహూ మెయిల్‌కు 276 మిలియన్ల నెలవారి వినియోగదారులు ఉన్నారు. 75 మిలియన్ల మంది యాప్‌ను వాడుతున్నారు. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్‌ పీసీలు, కంప్యూటర్లు మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలామంది యాహూ ఈమెయిల్‌ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. మొత్తం వినియోగదార్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది... కేవలం తమ మొబైల్స్‌, ట్యాబ్లెట్స్‌ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయోగిస్తున్నారు. యాహూ మెయిల్‌ వినియోగదారుల్లో 60 శాతం మందికి పైగా అమెరికాయేతర దేశాలవారే ఉన్నారు. కనుకనే ప్రస్తుతం ఉన్న తమ వినియోగదార్లను మరో ఈమెయిల్‌ సంస్థ వైపు మళ్లకుండా ఉండేందుకు అవసరమైన విధంగా కొత్త మొబైల్‌ యాప్‌ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు యాహూ చెబుతోంది. ముఖ్యంగా మన దేశానికి వచ్చేసరికి... దేశీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో తన సేవలను అందిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: