ఇదో కొత్తరకమైన ఆఫర్.. ఇప్పటికే ఐటి వాళ్ళు అదే సాఫ్ట్ వేర్లకు వారానికి 5 రోజులే పని.. ఇప్పుడు మళ్ళి ఆ ఐయుదు రోజులలో కూడా ఒక రోజు తీసేసి నాలుగురోజులు హాలిడేస్ ఇస్తున్నారు. వారాంతపు సెలవులు కింద వీక్లీ ఆఫ్‌లు మూడు రోజులు చెయ్యనున్నారు. అయితే, ఆ దేశంలో త్వరలో ఉద్యోగుల పనిదినాలను నాలుగు రోజులకు కుదించనున్నారు. 

 

అంతేకాదు పని వేళలు కూడా కేవలం 4 గంటలకే కుదించనున్నారు. ఈ వరాన్ని ఇచ్చింది ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో ప్రధానిగా ఎన్నికైన ఆమె.. త్వరలో పాలన వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని ఆలోచిస్తున్నారు. 

 

వారంలో మూడు రోజులు సెలవులు ఇచ్చి తమ దేశంలోని ప్రజలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపాలని అందుకే ఈ అవకాశం ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు. దీంతో ప్రపంచమంతా ఈ వార్త వైరల్ అవుతుంది. వావ్ అంటూ అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే ఆ ప్రధాని మాట్లాడుతూ.. ''ప్రజలు తాము ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం సమయం కేటాయించేందుకు అర్హులు. దీన్ని ఒక సాంప్రదాయంలా పాటించాలి. మన ఉద్యోగ జీవితంలో ఇది మరో ముందడుగు కావాలి'' అని తెలిపారు. అయితే, ఆమె ఈ నిర్ణయాన్ని రాత్రికి రాత్రే తీసుకోలేదు. 

 

ఆమె ఫిన్‌లాండ్ ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా పనిచేసిన రోజుల్లో తమ ఉద్యోగులపై ఈ ప్రయోగం చేశారు. దీని వల్ల ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా, ప్రొడక్టివిటీ కూడా పెరిగినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి లీ అండర్సన్ స్వాగతించారు.

 

ఎంతైనా ఆ దేశపు ఐటీ వాళ్ళు అదృష్టవంతులు.. మన దేశంలో ఉన్నారు.. అబ్బో.. కుదిరితే ఆదివారాలు కూడా వచ్చ్చి పని చెయ్యమని చెప్తారు రక్షేషులు. మొన్నటికి మొన్న మోడీ కూడా పని గంటలు పెంచాలని అనుకున్నాడు. భారత్ లో కూడా కొన్ని చోట్ల వారానికి రెండు రోజులు సెలవలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: