ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతు  సుపరి పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలే  కాకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాటితరం ఆలోచనలకు కాకుండా నేటి తరం యువ ఆలోచనలకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో సుపరిపాలన అందిస్తు  అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని పెను సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. 

 

 

 ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పేద కుటుంబం లోని  విద్యార్థులు చదువుకోవాలని ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబంలో ఒక విద్యార్థికి ప్రతి ఏటా 15 వేల రూపాయలు అందించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా విద్యార్థి తల్లి ఖాతాలో  ప్రతి ఏడు 15 వేల రూపాయలు జమవుతాయి. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే ప్రతి విద్యార్థి 75% వరకు హాజరు కలిగి ఉండాలని.. లేని పక్షంలో ఈ పథకానికి అనర్హులు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక తాజాగా అమ్మ వడి పథకం పై కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఈసారి 75 శాతం హాజరు నిబంధనను పరిగణించ కూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కానీ వచ్చే సంవత్సరం నుంచి మాత్రం 75 శాతం హాజరు ఉన్న వాళ్ళకే ఈ పథకం లబ్ధిదారులుగా  పరిగణలోకి తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇక గతంలో చెప్పినట్లు గానే 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు ఈ పథకం వర్తించదు అంటూ మరోసారి గుర్తు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఆరు నెలల విద్యుత్ బిల్లులను  సరాసరి గుర్తించి అర్హులను నిర్ణయిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: