అవినీతి, నిర్లక్ష్యం. ఈ రెండు దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసుకుని కూర్చున్నాయి. వీటి వల్ల ప్రభుత్వ ఉద్యోగులు బాగుపడుతున్నారే గాని, సామన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే అడిగేవారు లేరనే భావన. పట్టించుకునే వారుండరనే ధైర్యం.

 

 

ఇలాంటి వారికి ఇప్పుడు తెలంగాణ సీయం గట్టి షాకిచ్చారు. అదేమంటే తాము నిర్వర్తిస్తున్న విధుల పట్ల నిర్లక్ష్యంవహిస్తే క్షమించేది లేదని, అందుకుగాను తగినవిధంగా చర్యలు తీసుకో బడతాయని హెచ్చరిస్తూ, 14 మంది టీచర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

ఇదేకాకుండా విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న మరో 92 మంది టీచర్లపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వీరంతా అనుమతి లేకుండానే తమ విధులకు గైర్హాజరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని విద్యా శాఖ తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలు చేపట్టింది..  

 

 

ఇదిలా ఉండగా విద్యార్ధులకు తెలివి తేటలు నేర్పించవలసిన ఉపాధ్యాయులు, తామే తెలివిమీరి, ఎవరైనా అధికారులు తనిఖీకి వచ్చిన సమయంలో పాఠశాల కార్యాలయంలో ముందస్తుగానే సిద్ధం చేసి ఉంచిన లీవ్ లెటర్ చూపించడం, లేదంటే తోటి ఉపాధ్యాయుడి సహకారంతో దొంగ హాజరు వేయించుకోవడం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

ఈ తంతు చాలా కాలం నుంచి నడుస్తున్నా.. ఈ మద్య అధికారులు ఆలస్యంగా గుర్తించినట్లు సమాచారం. ఇకపోతే సస్పెండైన టీచర్లలో కామారెడ్డిలో ఇద్దరు, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు, హైదరాబాద్‌లో ఇద్దరు, ఖమ్మంలో ఒకరు, కరీంనగర్‌లో ముగ్గురు, నిర్మల్‌లో ఒకరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్ల పై ప్రభుత్వం ఈ రకమైన చర్యలు చేపట్టింది. ఇలాగే అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లను ప్రక్షాళన చేస్తే బాగుండును అనేది సామాన్యుని అభిప్రాయం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: