అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత స్థాయి కమాండర్ సులేమాని మరణించిన సంగతి తెలిసిందే.  సులేమాని ని టార్గెట్ చేసుకొని అమెరికా ఈ దాడులు చేసింది.  దీంతో ఇరాన్ అమెరికాపై ప్రతీకారంతో రగిలిపోయింది.  సులేమాని అంత్యక్రియలు టెహరాన్ లో జరిగాయి.  అయన అంతిమ యాత్రకు ఇరాన్ ప్రజలంతా కదిలి వచ్చారు.  కదం తొక్కారు.  దీంతో టెహ్రాన్ వీధులన్నీ నిండిపోయాయి.  ఇరాన్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఈ సందర్భంగా సులేమాని  కుమార్తె జీనాబ్ పేర్కొన్నది.  


అంతేకాదు, ఇరాన్ అణు ఒప్పందం నుంచి పక్కకు తప్పుకోవడంతో మరింత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఇరాన్ పై అమెరికా ఏ క్షణంలో అయినా దాడులు చెయ్యొచ్చు అనే వార్తలు అందటంతో ఆ ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.  అంతేకాదు, ఇరాక్ కూడా అమెరికా సైన్యాన్ని తన దేశం వదిలి వెళ్లాలని స్పష్టం చేసింది.  ఇరాక్ పార్లమెంట్ లో ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.  


ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో అమెరికా దీనికి ససేమిరా అంటోంది.  వేలకోట్ల డాలర్లు అక్కడ పెట్టుబడి పెట్టి ఎయిర్ బేస్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని, అక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఆ డబ్బును ఇరాక్  అప్పటివరకు కదిలేది లేదని అంటోంది.  కానీ ఇరాక్ మాత్రం తమ భూభాగంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఉన్నాయని, ఈ సమయంలో అమెరికా సైన్యం ఇక్కడే ఉంటె ఇరాక్ కు ఇబ్బంది అవుతుందని అంటోంది.  


ఇకఇరాన్, అమెరికా మధ్య యుద్ధం సంభవిస్తే దాని వలన ఇండియాకు చాలా నష్టం జరుగుతుంది.  అమెరికా తన ఆదాయాన్ని ఆర్మీకి కేటాయిస్తుంది.  ఫలితంగా అక్కడ ధరలు పెరిగాయి.  అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా ధరలు పెరుగుతాయి.   మద్యంతో ఇండియా కొట్టుమిట్టాడుతోంది.  ఇప్పుడు ఇది కూడా జరిగితే... దాని వలన సమయాలు వస్తాయి.  అందుకే ఇండియా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అని ఎదురు చూస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: