ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి టీఆర్ఎస్ నేత హరీష్ రావు కు సొంత పార్టీ నుంచి నిరసన సెగ  ఎదురవుతున్నదా  అంటే అవుననే మాటే ఎక్కువ  వినిపిస్తోంది. ఎందుకంటే ప్రతి విషయంలో హరీష్ రావు పక్కన పెట్టేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు కూడా వచ్చాయి. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టు కోసం తిండి నిద్రలు మాని రాత్రింబవళ్ళు కష్టపడి ఎవరు పూర్తి చేయలేనంత సత్వరంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే... కాళేశ్వరం ప్రాజెక్టు మొదలయ్యే సమయానికి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ హరీష్ రావు ను పక్కన పెట్టేశారు. ఇక హరీష్ రావు కొంచమైనా కాలేశ్వరం గణత దక్కకుండా..  కెసిఆర్ మొత్తం కాలేశ్వరం ఘనతను దక్కించుకున్నారు. అంతేకాకుండా టిఆర్ఎస్ లో హరీష్ రావు ట్రబుల్ షూటర్ అన్న విషయం తెలిసిందే. 

 

 

 అలాంటి కీలక నేత అయిన హరీష్ ను  టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక  మంత్రి పదవి వస్తుందా లేదా అనుమానాలు కూడా వచ్చాయి. కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు ని పక్కన పెడుతున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎట్టకేలకు రెండో  విడతలు హరీష్ రావు  ఆర్థికమంత్రిగా పదవి దక్కింది. ఇకపోతే  హరీష్ రావును కొంచెం కొంచెంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పక్కన బెడుతున్నప్పటికీ హరీష్ రావు మాత్రం ఇప్పటికీ పార్టీ అధినేతపై కానీ ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడింది లేదు... ఎవరు ఎంత రెచ్చగొట్టినా పార్టీకి పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కి విధేయుడు గానే వ్యవహరించారు హరీష్ రావు. అయితే టిఆర్ఎస్ లో  హరీష్ రావు కు అంతగా ఇంపార్టెంట్ ఇవ్వకపోవడంతో అటు  హరీష్ అభిమానులు కూడా కాస్త హర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉత్తరద్వారం గుండా పలువురు ప్రముఖులు పోటెత్తారు. దాదాపు ప్రముఖుల అందరికీ దర్శనభాగ్యం బాగానే దక్కింది. కానీ హరీష్ రావు  విషయంలో మాత్రం ప్రోటోకాల్ తేడా కొట్టేసింది. దీంతో హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేసి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఇక టీడీపీ పెద్దలు హరీష్ ని ఒప్పించి దర్శనం కల్పించాల్సి వచ్చింది. 

 

 

 ఇదిలా ఉంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల వెళ్ళిన మంత్రి కేటీఆర్ కి మాత్రం ఏపీ లోని అధికార పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కేటీఆర్ కి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. కానీ హరీష్ రావు విషయంలో మాత్రం ఇలాంటిదీ జరగలేదు. అసలు హరీష్ రావు ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ విషయంలో చిన్నపాటి సమన్వయ లోపం అని అధికార వైసిపి నేతలు టిడిపి వర్గాలు చెబుతున్నప్పటికీ ఎక్కడో తేడా కొట్టేసింది అని హరీష్ రావు  అభిమానులు మాత్రం అనుకుంటున్నారట. దీంతో హరీష్ రావుకి తిరుమలలో కూడా తీరని అవమానం జరిగింది అని తెలంగాణ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: