దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య కుదించేందుకు నిర్ణయించింది. పలు బ్యాంకులను విలీనానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై ఏపీ ప్రజల్లో బ్యాంకు ఉద్యోగుల్లో  కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైనా విషయం తెలిసిందే. బ్యాంకుల విలీనం చేపట్ట వద్దంటూ  ప్రజలే  కాకుండా బ్యాంకు ఉద్యోగులు అందరూ ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేశారు కూడా. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఇప్పటివరకు బ్యాంకుల విలీన ప్రక్రియ విషయంలో  వెనక్కి తగ్గ లేదు. ఇకపోతే బ్యాంకుల విలీనం కోసం  అయితే ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు అందరూ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకుల విలీనం ప్రక్రియను నిలిపివేయాలంటూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు నిరసనలు కూడా తెలుపుతున్నారు బ్యాంకు ఉద్యోగ సంఘాలు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ బంద్  నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె నిర్వహించేందుకు నడుం బిగించాయి. కేంద్రం దిగివచ్చి వెంటనే బ్యాంకుల విలీన ప్రక్రియ ను వెనక్కి తీసుకునేంత వరకు సమ్మె  నిర్వహిస్తామని చెప్పారు ఉద్యోగ సంఘాలు. ఈ నేపథ్యంలో ప్రజలకు మరోసారి కష్టాలు మొదలు కానున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో అటు బ్యాంకులే కాదు ఏటీఎంలు కూడా మూతపడడంతో ప్రజలకు నగదు  కష్టాలు మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 

 

 

 కాగా రేపటి నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె మొదలు కానుండడంతో అన్ని బ్యాంకులతో పాటు ఏటీఎంలు కూడా మూతపడనున్నాయి. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తు.. బ్యాంకింగ్ సంఘాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మె చేపట్టనున్నారు. సమ్మెలో దాదాపు 25 కోట్ల  మంది కార్మికులు పాల్గొననున్నారని బ్యాంకింగ్  సంఘాలు తెలిపాయి. ఈ క్రమంలో ఏటీఎంలు బ్యాంకులు అన్నీ మూతపడుతున్నాయి. దీంతో  వినియోగదారులు తమకు అవసరమైన డబ్బును ఒకరోజు ముందు అంటే ఈ రోజు తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: