వైకాపా మహిళా నేత, ఎమ్మెల్యే రోజాపై కొంతమంది వ్యక్తులు నగరి నియోజక వర్గంలో పర్యటించే సమయంలో ఆమె కారును అడ్డుకొని కారుపై దాడిచేసిన సంగతి తెలిసిందే.  వైకాపాకు చెందిన కార్యకర్తలు దాడులు చేయడంతో ఆమె షాక్ అయ్యింది.  సొంత వ్యక్తులే ఇలా దాడులు చేయడం వెనుక ఎవరున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ కోణంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  


ఇందులో ముఖ్యంగా రోజాకు వ్యతిరేకంగా ఓ వర్గం వ్యక్తులు గత నాలుగు నెలలుగా ఓడించేందుకు, ఆమె పరపతిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వచ్చింది.  ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రోజా సిద్ధం అయ్యింది.  తనపై దాడికి యత్నించిన వైకాపా కార్యకర్తలపై ఇప్పటికే కేసులు పెట్టారు.  కావాలని కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్నట్టు రోజా ఇప్పటికే పేర్కొన్నది.  


సచివాలయం ఏర్పాటుకు అభ్యంతరం ఉంటే తన ఇల్లు నగరిలోనే ఉందని.. వచ్చి వినతిపత్రం ఇచ్చి పనిచేయకపోతే మాట్లాడినా ఫర్వాలేదన్నారు. కానీ వారి మనసులో తనను ఓడించాలనుకున్నవారు.. తన విజయాన్ని తట్టుకోలేక ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.  సచివాలయం ఏర్పాటు జరిగితే ప్రతి ఒక్కరిని పధకాలు అందుబాటులో ఉంటాయనే లక్ష్యంతోనే జగన్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని రోజా పేర్కొన్నది. 

 

గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు అమ్ములు వర్గం వ్యక్తులు తీవ్రంగా కృషి చేశారని, కానీ, అవి సాధ్యం కాలేదని, అందుకే తనపై దాడులు చేయడానికి సిద్ధపడ్డారని ఆమె పేర్కొన్నారు.  ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన నియోజక వర్గ ప్రజలు తనవెంట ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని అన్నారు.  ప్రజల ఎప్పుడు అభివృద్ధి కోరుకునే వ్యక్తులవైపు ఉంటారని, అందుకే జగన్ కు ఓటు వేశారని రోజా పేర్కొన్నది. రాష్ట్రం అభివృద్ధి జగన్ నేతృత్వంలోనే జరుగుతుందని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతాయని రోజా తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: