గత కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం వాహనదారులు జరిమానా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 ని  తీసుకొస్తూ వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి విషయం తెలిసిందే. ఇంత భారీ స్థాయిలో జరిమానాలు ఎలా విధిస్తారు అంటూ మోటార్ వాహనాల చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు వాహనదారులు. ఇక పోతే ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్పారు.

 

 

తమ  రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనుకోవడం లేదని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టం 2019 పై కేంద్రం మరో ముందడుగు వేసింది. నూతన వాహనాల చట్టం ప్రకారం  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేంద్రం సూచించిన జరిమానాలు విధించాలని ఆయా  రాష్ట్రాలకు మోడీ సర్కార్ సూచించింది. మోటార్ వాహన చట్టం 2019 పై  రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మోటార్ వాహనాల సవరణ చట్టం 2019లో జరిమానాలను విధించాలని తక్కువ జరిమానాలను విధించకూడదు అంటూ సూచించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాత మోటార్ వాహనాల సవరణ చట్టం పై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 లో పేర్కొన్న విధంగా జరిమాణాలను  విధించాలని  పేర్కొంది.

 

 

 గుజరాత్ ఉత్తరాఖండ్ మణిపూర్ కర్ణాటక రాష్ట్రాల్లో  ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన కేంద్రం తాజా వివరణ ఇచ్చింది. దీంతో కేంద్రం ఇచ్చిన తాజా ఆదేశాలతో వాహనదారులు గుండెల్లో బాంబు పేలినంత  పనైంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాల చట్టంతో ఎక్కడ జరిమానాలు పడతాయో అని  వాహనదారులు బెంబేలెత్తి పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వాహనాల సవరణ చట్టం ప్రకారమే జరిమానాలు విధించాలని అన్ని రాష్ట్రాలకు సూచించడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.. మరి కేంద్రం సూచనలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: