ఢిల్లీలో నిర్భయ ఘటన దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. 23 ఏళ్ల నిర్భయ అనే యువతిని అతి  దారుణంగా ఆరుగురు కామాంధులు అత్యాచారం చేసి అనంతరం ఆమె మర్మాంగాల్లోకి పదునైన వస్తువులు జొప్పించడంతో తీవ్రంగా రక్తస్రావమై గాయపడిన యువతి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారికి కఠిన శిక్షలు పడాలంటు  ఏకంగా నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ ఈ కేసులోని నిందితులకు శిక్ష పడలేదు. ఇక తాజాగా సుప్రీం కోర్టులో నిర్భయ  కేసులోని నిందితులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉరిశిక్షను రద్దు చేయాలంటూ నిందితుల్లో ఒకరు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ సుప్రీంకోర్టు మరణ శిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. 

 

 

 నిర్భయ కేసులో దోషులు పవన్ గుప్తా ముఖేష్ సింగ్ అక్షయ్ ఠాగూర్ వినయ్ ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నలుగురు నిందితులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ నిర్భయ  తల్లి పాటియాలా  హౌస్  కోర్టును ఆశ్రయించింది. మరణ శిక్షకు వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీం కోర్టు దాఖలైన పిటిషన్ను కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో దోషులకు వ్యతిరేకంగా డెత్ వారంట్ జారీ చేయడంపై నేడు పటియాల హౌస్ కోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి కోర్టును ఆశ్రయించింది. ఎట్టి పరిస్థితుల్లోను నిందితులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టును అభ్యర్థించనున్నారు నిర్భయ తల్లి. 

 

 

 అయితే నిర్భయ కేసులో ఒక్కరే  ప్రత్యక్షసాక్షి ఉన్నారు అంటూ పవన్ గుప్తా తండ్రి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కాగా నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్షను లైవ్ లో  చూపెట్టాలి అంటూ దేశ ప్రజలందరూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఉరిశిక్షను లైవ్ లో  చూస్తే మరో సారి  ఇలాంటి అఘాయిత్యాలకు  పాల్పడడానికి కామాందులు  వెనకడుగు వేస్తారు అంటూ దేశ ప్రజానీకం డిమాండ్ చేసింది. ఇకపోతే నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడినట్లు తెలుస్తోంది. కాగా నిర్భయ ఘటన జరిగిన కొన్ని సంవత్సరాలు గడిచిన కూడా నిందితులకు శిక్ష పడకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: