ఐదేళ్ళు ఆకాశమే హద్దుగా అధికారాలను అనుభవించిన తమ్ముళ్ళల్లో కొందరు చంద్రబాబునాయుడుకు అదును చూసి పెద్ద షాకే ఇచ్చారు. రాజధానిగా అమరావతిని తరలించకూడదంటూ  గడచిన 20 రోజులుగా ఆందళనలు జరుగుతున్నా ఓ పచ్చ బ్యాచ్ మాత్రం అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు. ఉద్యమంలోకి అందరూ రావాలని చంద్రబాబు స్వయంగా ఎన్నిసార్లు పిలుపిస్తున్న వాళ్ళెవరూ పట్టించుకోవటం లేదు. వాళ్ళ పేర్లు అందరికీ తెలిసిందే లేండి.

 

చంద్రబాబు సిఎంగా ఉన్న రోజుల్లో  కొందరు విపరీతమైన అధికారాలను అనుభవించటం ద్వారా  వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2050 వరకూ తానే సిఎంగా ఉంటాననే భ్రమల్లో ఉన్న చంద్రబాబు కూడా  అధికారాలను అనుభవించటంలో కానీ డబ్బులు సంపాదించుకోవటంలో కానీ వారికి పూర్తి స్వేచ్చను ఇచ్చేశారు. అప్పట్లో అంతగా లబ్దిపొందిన వారు మరిపుడు ఎందుకు ఇటువైపు చూడటం లేదు ?

 

ఎందుకంటే తమ వ్యాపారాలను కాపాడుకోవటమే అన్న టార్గెట్ గా పని చేస్తున్నారు కాబట్టి. నిజానికి మొన్న ఐదేళ్ళు చంద్రబాబు బాగా ప్రోత్సహించిన వారిలో  కొందరు రాజకీయ నేతలు కాదు. పూర్తిగా వ్యాపారస్తులు మాత్రమే.  తెలుగుదేశంపార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ఆర్ధికంగా ఆదుకున్నారన్న ఏకైక కారణంతో పార్టీ భవిష్యత్తును చంద్రబాబు వాళ్ళపై ఉంచారు. సరే దానికి ప్రతిఫలం ఇపుడు అనుభవిస్తున్నారు లేండి.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అటువంటి వ్యాపార+రాజకీయవేత్తల్లో కొందరు మాత్రం చంద్రబాబుతో టచ్ లో ఉన్నారట. ప్రత్యక్షంగా అమరావతి తరలింపు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోయినా తెరవెనుక మాత్రం సాయం అందిస్తున్నారట.  సరే ఇక భజన బ్యాక్ ఎటూ ఉంది లేండి. ఇక్కడ  సమస్య ఏమిటంటే తెరవెనుక బ్యాచ్ కు అయినా, భజన బ్యాచ్ నేతల్లో కూడా చాలామందికి ప్రజాబలం లేదు.

 

ఏదో చంద్రబాబు ముందు కాస్త హడావుడి చేయటం, మీడియాలో కనబడటంతో ఉద్యమంలో బిజీగా ఉన్నామనే కలరింగ్ ఇస్తున్నారు. నిజానికి ఇటువంటి వాళ్ళ వల్ల ఉద్యమానికి ఎటువంటి ఉపయోగం లేదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబు డిమాండే బోగస్ అని చాలామందికి అర్ధమైపోయింది.  మద్దతుదారులు, కీలక వ్యక్తుల రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే అప్పుడు, ఇపుడు చంద్రబాబు తాపత్రయపడుతున్నారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందుకనే మిగిలిన జిల్లాల్లోని తమ్ముళ్ళు ఈ ఆందోళనల్లో పాల్గొనటానికి ముందుకు రావటం లేదు. మొత్తానికి తమ్ముళ్ళు మాత్రం చంద్రబాబు షాకిచ్చినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: