నేటి సమాజంలో మన ఆడబిడ్డలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. బ్రహ్మాండంగా చదువుకొని, కొలువు కు వెళితే తండ్రి లాంటి పై అధికారులు వారిని ఆగం చేయాలని మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి సంఘటన ప్రకాశం జిల్లాలో ఒకటి చోటుచేసుకొని కలకలం రేపుతోంది.


వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలేనికి చెందిన మహిళ వీఆర్‌ఏతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు ఆ జిల్లా తహసీల్దార్ డీవీబి వరకుమార్‌. అయితే, పోయిన నెల 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి తహసీల్దార్ ఆఫీసు స్టాఫ్ ని తన ఇంటికి పిలిచింది మహిళ వీఆర్ఏ. అయితే ఆ రోజు తన ఇంటికి వరకుమార్ రాలేదు. దాంతో ఆయన వీఆర్ఏతో మాట్లాడుతూ.. ' క్రిస్మస్ రోజు నువ్వు పిలిచినప్పుడు రాలేకపోయాను. మరి వాళ్ళ అందరికి విందు ఇచ్చినప్పుడు.. నాకివ్వరా', అంటూ ఆమెను అడిగాడు. శనివారం రోజు వీఆర్ఏ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా... నాకు కోడి కూరతో పాటు నువ్వు కూడా కావాలి అంటూ ఆమెతో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. దాంతో, ఆమె చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయింది. మీరు తండ్రి లాంటివారు సార్ కొంచెం మంచిగా ప్రవర్తించండి అంటూ ఆమె తనకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అతడు మాత్రం ఏమీ వినిపించుకోకుండా.. ఆమెను వెనుకనుంచి కౌగలించుకొని చాలా అసభ్యకరంగా ఆమెపై లైంగిక దాడికి దిగాడు. దాంతో ఆమె భయభ్రాంతులకు గురై ఆఫీస్ నుంచి వెంటనే బయటకు వచ్చేసింది.

ఆ తర్వాత వర కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామి రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై నిందితుడు తహసీల్దార్ వరకుమార్ మాట్లాడుతూ... తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని ఆరోపిస్తున్నారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నిజాలు ఏంటో వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: