అమరావతిని కాపాడుకోవటానికి విద్యార్ధులందరూ ఉద్యమించాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. తమ భవిష్యత్తును కాపాడుకోవటానికి విద్యార్ధులు రోడ్లమీదకు వచ్చి ఉద్యమాలు చేయాలని పదే పదే చంద్రబాబు పిలుపిచ్చినా విద్యార్ధులెవరూ లెక్క చేయటం లేదు. చివరకు తెలుగునాడు స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి కూడా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

చంద్రబాబు ఎంత చెప్పినా విద్యార్ధులు ఎందుకు పట్టించుకోవటం లేదు ? ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు  ఇదే చంద్రబాబు విద్యార్ధులను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం పేరుతో విద్యార్ధులు రోడ్లమీదకు వస్తే కేసులు పెట్టి జైళ్ళకు పంపారు.  ఉద్యమాలన్న విద్యార్ధులను కాలేజీల నుండి డీబార్ చేయమని ప్రిన్సిపాళ్ళను చంద్రబాబు ఆదేశించారు. అలాగే పిల్లలను అదుపులోకి పెట్టుకుని రోడ్లమీదకు రాకుండా చూసుకోవాలంటూ తల్లి, దండ్రులకు కూడా వార్నింగులిచ్చారు.

 

సరే చంద్రబాబు ఎన్ని వార్నింగులిచ్చినా విద్యార్ధులు అప్పట్లో రోడ్లమీదకు వచ్చేశారు. కొందరిని కాలేజీల్లో నుండి సస్పెండ్ చేస్తే వెంటనే మళ్ళీ ఉద్యమాలు చేసి ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారు విద్యార్ధులు.  ఒక్క ప్రత్యేకహోదా అనే కాదు. ఏ విషయంలో కూడా గొంతెత్తేందుకు లేకుండా విద్యార్ధులపై అణచివేత ప్రయత్నాలు జరిగాయి.

 

అందుకనే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతరేకంగా విద్యార్ధులు ఉద్యమించి వైసిపికి జై కొట్టారు.  సరే సీన్ కట్ చేస్తే ఇపుడు అమరావతిని కాపాడుకోవటానకి చంద్రబాబు ఆందోళనల పేరుతో పెద్ద డ్రామాలాడుతున్నారు. తనకు మద్దతుగా విద్యార్ధులు రోడ్లపైకి రావాలని పదే పదే బతిమలాడుకుంటున్నారు. అందుకనే విద్యార్ధులెవరూ కనీసం అటువైపు కూడా చూడటం లేదు.

 

అంటే అధికారంలో ఉంటే ఒకలాగ, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగ చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు ? అనేందుకు తాజా ఘటనే ఉదాహరణ. అదే సమయంలో అధికారంలోకి రాగానే విద్యార్ధుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రారంభించారు.  ఇద్దరి మధ్య తేడాను గ్రహించిన విద్యార్ధులు చంద్రబాబును పట్టించుకోవటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: