ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజదానుల  నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రాజధాని అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రైతులే కాదు రైతు కుటుంబీకుల మొత్తం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు . అయితే అమరావతిలో రోజురోజుకు రైతులు చేపడుతున్న ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో పలువురు రైతులు నిరసన లో పాల్గొని మనస్థాపం చెంది మరణిస్తున్నారు. 

 


 అటు అమరావతిలో రైతులు తీవ్ర నిరసనలకు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరావతి పరిరక్షణ సమితి విరాళాలు కూడా బాగానే అందుతున్నాయి. టిడిపి అధినేత ప్రతిపక్షనేత ఆయన చంద్రబాబు నాయుడు అమరావతి లో రైతులకు మద్దతు తెలుపుతూ అమరావతి రైతులతో గడుపుతున్నారు. ఇకపోతే జగన్ నిర్ణయం తీవ్ర మనస్తాపం చెందిన రైతులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇక తాజాగా అమరావతి నుంచి రాజధాని తరలింపు పై రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా మరో వ్యక్తి  ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు లో చిరు వ్యాపారి రామాయణపు లక్ష్మయ్య మృతి చెందాడు. పది రోజులుగా ఆయన అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఆందోళనల్లో పాల్గొంటున్నారు. 

 

 

తమకు అన్యాయం చేయొద్దంటూ జగన్ సర్కార్ ని కోరుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని అమరావతి నుంచి తరలి పోతుందని ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనకు గురైనట్లు పొన్నెకల్లు గ్రామస్తులు మీడియాకు తెలిపారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు చేపడుతున్న నిరసనల్లో  పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇకపోతే అమరావతి రాజధాని కోసం రైతులు ఆందోళన మరింత  ఉధృతం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: