ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత కష్టపడి ప్రజలకు మంచి చెయ్యాలి అనుకున్న సరే.. ప్రతిపక్షాలు ఆ మంచిని అదిలో అంతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకపక్క మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు మరోపక్క అయన దత్తపుత్రుడు ఇలా ఇద్దరు ఒకరికి మించి మరొకరు రాజకీయాలు చేస్తున్నారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గత నెల మూడు రాజధానుల ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనను అభివృద్ధి కోసం చేస్తే.. రాజధాని రైతులకు వ్యతిరేకంగా చూపించాడు చంద్రబాబు. దీంతో అమరావతి రైతులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల ఆందోళన నిజానిజాలు తేల్చేందుకు సీఎం జగన్ సిద్ధం అయినట్టు తెలిసింది. 

 

అసలు రైతులు ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక టీడీపీ నేతలు, రియల్టర్లు ఉన్నారా? అనే విషయంపై నిజానిజాలు తేల్చేందుకు అయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి కొడాలి నాని సారథ్యంలో మంత్రుల బృందానికి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని సీఎం జగన్ ఆదేశించారు. 

 

సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి కొడాలి నాని తాజాగా మీడియా సమావేశంలో రాజధాని రైతులకు పిలుపునిచ్చారు. రైతులను చర్చలకు రావాలంటూ అయన ఆహ్వానించారు. డిమాండ్లు వినిపిస్తే న్యాయం చేస్తామని కోడలి నాని ప్రకటించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని కోడలి నాని తెలిపి రాజధాని రైతుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు జగన్ సర్కర్. 

 

కాగా ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీ కూడా నివేదికలు ఇచ్చేశారు. దీంతో హైపవర్ కమిటీ కూడా పని ప్రారంభించింది. ఈనెల 17 లేదా 18 తేదీల్లో రాజధానిపై హైపవర్ కమిటీ నివేదికను అందించనుంది. అంటే దీన్ని బట్టి చూస్తే.. రాజధానిలో రైతుల పేరుతో సాగుతున్న నిరసనల గుట్టు రట్టు కానుందా ? అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: