చరిత్రలో జనవరి 12న ఎన్నో సంఘటనలు... ఎంతో మంది ప్రముఖులు జనాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరి జనవరి 12 వ తేదీన ఎవరెవరు మరణించారు ఎవరెవరు జన్మించారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి తెలుసుకుందాం రండి. 

 

 మొట్టమొదటి ఎక్స్ రే  : ప్రపంచంలోనే మొదటి సారి అమెరికాకు చెందిన డాక్టర్ ఎండ్రి. హెల్  స్మిత్  మొట్టమొదటిసారి ఎక్స్ రే  తీస్తారు. మొట్టమొదటిసారి చేతిలో దిగబడిన బుల్లెట్ ను ఎక్స్ రే  తీశారు.1896 జనవరి 12 వ తేదీన ఈ ఘటన జరిగింది.


 

 విమాన సేవలు : 1970 సంవత్సరంలో బోయింగ్ అనే విమానయాన సంస్థ 747 విమాన ప్రయాణికులకు సేవలు అందించడం ప్రారంభించింది. బోయిన్ కంపెనీ ప్రస్తుతం విమాన  సంబంధ సామాగ్రి తయారు చేసే కంపెనీ. దీని వ్యవస్థాపకుడు విలియం  ఎడ్వార్డ్  బోయింగ్. ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక విమానాలు తయారు చేసే సంస్థ.
 

 

 జపాన్ భూకంపం : జపాన్ ప్రజలందరికీ జనవరి 12 ఒక చేదు జ్ఞాపకం. 1995 జనవరి 12 వ తేదీన జపాన్లోని కోబే నగరంలో పెను భూకంపం సంభవించింది. ఈ భూకంప ఘటనలు 5092 మంది చనిపోయారు.

 


 హైతీ భూకంపం : 2010 జనవరి 12వ తేదీన హైతీలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంఘటనలో  వేలాది మంది మృతి చెందారు.

 

 స్వామి వివేకానంద జననం : స్వామి వివేకానంద ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. ఇప్పటికీ స్వామి వివేకానంద ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. స్వామి వివేకానంద 1863 జనవరి 12 వ తేదీన జన్మించారు. 1902 జూలై 4 వ తేదీన స్వామి వివేకానంద తుది శ్వాస విడిచారు. భారత సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. ఇప్పటికీ భారత దేశ ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. మానవాళి భవిష్యత్తు కోసం ఎన్నో సిద్ధాంతాలను అందించారు స్వామి వివేకానంద. వివేకానంద ప్రబోధాలు ఇప్పటికీ ఎంతో మందిలో మార్పు తెస్తూనే ఉంటాయి. 

 

 జాతీయ యువజన దినోత్సవం : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు . భారత ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామి వివేకానంద జన్మించిన రోజున జనవరి 12న భారత దేశం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

 రీఛర్డ్ సన్ జననం  : వెస్టిండీస్ మాజీ క్రీడాకారుడు అయిన రిచర్డ్సన్ 1962 జనవరి 12 వ తేదీన జన్మించాడు. రీచర్డ్సన్  వెస్టిండీస్ క్రికెట్ జట్టు కు నాయకత్వం కూడా వహించారు . తన క్రికెట్ నాయకత్వంలో వెస్టిండీస్ ముందుకు దూసుకెళ్తూ ఎన్నో విజయాలను జట్టుకి  అందించారు రిచర్డ్ సన్ . 

 జఫ్ జోసెఫ్ : ఆన్లైన్ దిగ్గజమైన అమెజాన్ డాట్ కాం వ్యవస్థాపకుడు అధ్యక్షుడు జఫ్ జోసెఫ్. అంతేకాకుండా అమెజాన్ డాట్ కం యొక్క కార్యనిర్వహణ అధికారి మరియు అమెజాన్ డాట్ కం పాలకమండలి సభాపతి. ఈయన 1964 జనవరి 12 వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: