ఒక్కసారి పదవి వస్తే తరాలకు తరబడి కూర్చుని తినేలా అక్రమార్జన పోగేసుకుంటున్నారు ఈ తరం నాయకులు. కార్పొరేటర్ నుంచి మంత్రి వరకూ అంతా అక్రమ సంపాదనకు లాకులెత్తేవారే కానీ.. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు నడిపే వాళ్లు కరవైపోయారు. కానీ.. దేశానికి ప్రధాన మంత్రి అయినా సరే.. కొడుకు ఉద్యోగం కోసం రికమెండ్ చేయని రాజకీయ నాయకుడి సంగతి మీకు తెలుసా..?

 

తన హయాంలో ఎక్కడో ఓ రైలు ప్రమాదం జరిగిందని అందుకు బాధ్యత వహిస్తూ రైల్వేశాఖా మంత్రిగా రాజీనామా చేసిన వ్యక్తి గురించి మీరు విన్నారా.. ఆయనే లాల్ బహుదూర్ శాస్త్రి. మన భారత దేశ రెండో ప్రధాన మంత్రి. పదవన్నది ప్రజాసేవకే అని నమ్మే అచ్చమైన గాంధేయవాది ఆయన.

 

1926వ సంవత్సరంలో శాస్త్రి కాశీ విద్యాపీటం నుండి ప్రధమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. కాశీ విద్యాపీటం ఇచ్చే పట్టాను ఆ రోజులలో "శాస్త్రి" అనే పదంతో గౌరవంగా సంభోదించే వారు. మహాత్మా గాంధి, బాల గంగాధర తిలక్ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1921వ సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లినా అప్పటికి ఇంకా మైనర్ కావడంతో బ్రిటీష్ వాళ్లు ఆయన్ను జైలు నుండి పంపేశారు.

 

శాస్త్రి 1952లొ ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్య సభకు ఎన్నికయ్యారు. మే 13 1952 నుండి డిసెంబర్ 7 1956 వరకు కేంద్ర రైల్వే మరియు రవాణా శాఖా మంత్రిగా పనిచేసారు. 1956 సెప్టెంబర్ నెల మహబూబ్ నగర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి. అప్పటి ప్రధాని జవహర్ లాల్ ఆ రాజీనామాను తిరస్కరించారు. మూడు నెలల అనంతరం తమిళనాడు లోని అరియాలూర్లో జరిగిన మరో ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తిరిగి రాజీనామా సమర్పించారు.

 

జరిగిన ప్రమాదానికి శాస్త్రి గారికి సంబంధం లేకపోయినప్పటికీ, ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని ప్రకటిస్తూ నాటి ప్రధాని ఆ రాజీనామాను అంగీకరించడం జరిగింది. నెహ్రూ తర్వా ప్రధాని అయిన శాస్త్రి 1966 జనవరీ 11 తాష్కెంట్‌లో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: