రాహుల్ ద్రవిడ్ జననం : 1973 జనవరి 1న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ ద్రావిడ్ జన్మించారు. 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రాహుల్ ద్రవిడ్ . ప్రపంచంలోనే టాప్10 దిగ్గజ క్రికెటర్ లలో ఒకరు రాహుల్ ద్రవిడ్ . అద్భుతమైన ఆట ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోనే దిగ్గజ  క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టుకు అందించిన సేవలను ఇప్పటికీ ప్రేక్షకులు మరువలేరు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ స్ట్రైక్   అగ్రస్థానంలో ఉంది . తన సారథ్యంలో జట్టును ముందుకు తీసుకెళ్తూ ఎన్నో విజయాలను భారత్ కి సొంతం చేశారు రాహుల్ ద్రావిడ్. టేస్ట్ మ్యాచుల్లో పది వేల పరుగుల మైలురాయిని అధిగమించిన దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ . ఇంగ్లాండ్ పై లార్డ్స్  మైదానంలో తొలి టెస్ట్ ఆడిన రాహుల్ ద్రావిడ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ దిగ్గజ క్రికెటర్ గా మారిపోయాడు. నేటి తరం యువ ఆటగాళ్ల కోసం ఎన్నో రికార్డులు నెలకొల్పాడు రాహుల్  ద్రవిడ్.

 

 రాహుల్ ద్రవిడ్ ఆట ఇప్పటికి ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా ఉంటుంది. దూకుడుకు మారుపేరుగా రాహుల్ ద్రవిడ్  ఉండేవారు. ఎన్నోసార్లు భారీ స్కోరును నమోదు జట్టుకు భారీ విజయాలను సైతం అందించారు రాహుల్ ద్రావిడ్. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ ఇండియన్  అండర్-19 టీంకి  కోచ్ గా  వ్యవహరిస్తున్నారు. ఇండియా అండర్ 19 జట్టును ముందుండి నడిపిస్తు.. ఎంతోమంది యువ ఆటగాళ్లను  టీమిండియా జట్టుకు అందిస్తున్నారు రాహుల్ ద్రవిడ్. టీం ఇండియాలో ఉన్న ఎంతో మంది యువ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటుదేలిన వారే.

 

 

 అండర్ 19 ట జట్టులో  ఆటగాళ్లు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ... అద్భుతమైన నైపుణ్యాన్ని ఆటగాళ్ళలో  ఒడిసి  పడుతూ.. ఎంతోమంది క్రికెట్ ప్లేయర్ లను  టీమిండియాకు అందజేస్తున్నారు రాహుల్ ద్రవిడ్ . రాహుల్ ద్రావిడ్ గురించి అండర్-19 ఆటగాళ్లందరూ ఎంతో గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్  మాకు ఉండడం ఎంతో అదృష్టం అంటూ ఇప్పటికే అందరు ఆటగాళ్లు పలు సందర్భాల్లో తెలిపారు. గతంలో అండర్ 19 ఆటగాళ్లు ఏకంగా అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా విజయం సాధించి సత్తా చాటారు. రాహుల్ ద్రావిడ్ కి టీమిండియా జట్టు కు కోచింగ్ వ్యవహరించేందుకు అవకాశం వచ్చినప్పటికీ కూడా యువ ఆటగాళ్లకు మాత్రమే కోచ్ గా ఉండటానికి  మొగ్గుచూపారు రాహుల్ ద్రవిడ్ . రాహుల్ ద్రవిడ్  లాంటి గొప్ప ఆటగాడు ఇండియాలో ఉండటం  క్రికెట్ ఆటకే  గర్వ కారణమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: