ఆయన ఎప్పుడూ సత్యమే పలుకుతాను అని సెప్తే ఎవడూ నమ్మండేంట్రా ? అసలు ఆయన అంటే మీకు ఎందుకురా అంత భయం ? రెండు ఎకరాల నుంచి వేలకోట్లు ఎలా సంపాదించాలో ఆయన దగ్గర కిటుకు ఉందిరా అంటే అలా పారిపోతున్నరేంట్రా బాబు. అసలు ఆయన బాధ మీకు అర్ధం కావడం లేదనే కదరా నా బాధంతా. ఆయన నిదురా నిప్పులు మానేసి మరీ మీ కోసం నలభై ఏళ్లుగా ఆ పని చేత్తాను ఈ పని చేత్తాను అంటూ హడావుడి చేస్తున్నాడు కదరా అయినా ఆయనకు అప్పుడే మీరు రిటైర్మెంట్ ఇచ్చేత్తారా ? ఇక చాల్లే బాబు మా కోసం నువ్వు పాటు పడింది ఇంక ఇంట్లో కూర్చో అని పంపేత్తారా ? ఆయన సేత్తానన్న అభివృద్ధి మీకు వద్దా ? మీరు బాలేవోల్లు రా బాబు. ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చినా పోన్లే ఆయన కొడుకు గారినైనా మీరు ఆదరిత్తరంటే ఆయన్ను మందలగిరి లో అడ్రస్ లేకుండా చేసేత్తారా మీకు ఎంత ధైర్యంరా బాబు. 


ఒక నాలుకతో మాట్లాడితే మీకు అర్ధం కాదెహే అందుకే కదా పాపం ఆయనలో ఉన్న ఇంకో మనిషి కూడా వచ్చి రెండు నాలుకలతో మాట్లాడినా మీరు పారిపోతారేంట్రా నాయనా ! మిమ్మల్ని ఎవడూ బాగుసేయలేడు కదరా ! రైతులకు, ప్రజలకు ఏదో ఏదేదో సేసేద్దామని దేశ విదేశాలు శెనక్కాయలు తినుకుంటూ తిరిగితే ఆయన్ను ఇంటికి అంపెత్తారా ? ఏం మనుషూల్రా ! అసలు మీకు లివరూ, కిడ్నీ ఉందా ? కట్టుబట్టలతో హైద్రాబాద్ నుంచి లగెత్తుకొచ్చేసినా మల్లీ దైర్యం అరువు తెచ్చేసుకుని లంకంత కొంప కట్టేసుకున్న ఆయన ధైర్యం మీరు ఇంకెప్పుడు గుర్తిత్తర్రా ! మీకు ఇలా కాదేహే మీరు ఇప్పుడు ఆ గన్ ని సీఎం సేసేసారు కదా సూడండిరా మీరు అడగకుండానే అన్నీ సేసేత్తూ మీరు అడగడానికి ఏమీ లేకుండా సేసేత్తన్నాడు. మీకు ఇప్పుడు బాగా తిక్క వదిలిందా ? 


నాకు తెలియక అడుగుతా ఆ సీఎం గన్ ఏంట్రా బాబు మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల అభివృద్ధి అంటాడు. ఏదో ఓకాసోటే సేసేత్తే పనైపోద్ది కదా ? మిగతా చోట్ల ఎలా పోతే  ఈయనకేంట్రా నాయనా ! నాకు ఇప్పుడు ఓ డౌటొచ్చిందిరా అమరావతి కి భూములు ఇవ్వనని చెప్పిన రైతుల దగ్గర ముప్పై మూడు వేల ఎకరాల దాకా లాగేసుకుని ఇప్పుడు ఏంట్రా  రైతులకు ఈ గన్ అన్యాయం సేసేత్తున్నాడు అని హడావుడి సేసేత్తున్నాడు ? ఓహో మర్సిపోయానురో ఆయనకు ఉంది రెండు నాలుకులు కదా మరిసితిని.

మరింత సమాచారం తెలుసుకోండి: