రీసెంట్ గా మోహన్ బాబు ప్రధాని మోడి ని కలిసిన న్యూస్ మనందరికీ తెలిసిందే .. తానొక్కరే కాకుండా పెద్ద కొడుకు మంచు విష్ణు , కూతురు మంచు లక్ష్మి లతో కలిసి మోడి ని కలిసిన కలక్షన్ కింగ్ మోహన్ బాబు .. అసలు ఎందుకు ఇలాంటి సరికొత్త ప్లాన్ వేశారు అని ఒకటే చర్చ నడుస్తోంది .

 

 

మొన్న MAA - మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రాజశేఖర్ తో గొడవ రోజు హైలైట్ అయిన మోహన్ బాబు ఆ తరవాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం సడన్ గా మోడి తో ప్రత్యక్షం అయ్యి అందరికీ చిన్న సైజు షాక్ ఇచ్చారు. మోహన్ బాబు - మోడి ల భేటీ కొత్త ఏమీ కాదు మోడి ప్రధాని అయిన తరవాత ఇది దాదాపు మూడవ సారి ఇలా కలవడం. గత 24 గంటలు గా మోహన్ బాబు బీజేపీ లోకి వెళుతున్నాడు అంటూ ఇంటర్నెట్ లో ఒకటే వార్తలు వస్తున్నాయి .

 

మోహన్ బాబు - మోడి ల మధ్య భేటీ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే దీనికి సంబందించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మోహన్ బాబు . రీ సెంట్ గా బాలీవుడ్ యాక్టర్లు అందరూ మోడి ని కలిసిన సంగతి తెలిసిందే .. అప్పట్లో కొంతమంది మాత్రమే సౌత్ ఇండియన్ స్టార్ లు మోడి ని కలవడం జరిగింది అయితే అప్పుడు వీళ్ళు మిస్ అయ్యారు ఈ సారి మాత్రం సౌత్ ఇండియా నుంచి భారీ గా హీరోలని సమీకరించుకుని వెళ్లడానికి మోహన్ బాబు ని మోడి ఉపయోగించుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

 

 

ఇది ఎంతవరకూ జరుగుతుందో తెలియదు కానీ మోడి - మోహన్ బాబు ల మధ్య జగన్ గురించి టాపిక్ వచ్చింది అని మాత్రం విశ్వసనీయ వర్గాల భోగట్టా . గత ఎన్నికలకి ముందు మోహన్ బాబు జగన్ కి సపోర్ట్ గా చంద్రబాబు కి యాంటీ గా ప్రచారం కూడా నిర్వహించారు.

 

 

ఈ నేపధ్యం లో జగన్ కి అప్పాయింట్మెంట్ విషయం లో డిల్లీ లో కొందరు ఎంపీ లు ప్రయత్నిస్తున్నా సరైన ఫలితం రావడం లేదు అనీ అందుకే మోహన్ బాబు తో ప్రయత్నించారు అనీ పక్కాగా మోడి అప్పయింట్మెంట్ త్వరలోనే మోహన్ బాబు జగన్ కి ఇప్పిస్తారు అని వైకాపాలోనే డిస్కషన్ లు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: