ఈ దేశానికి ఎంతమంది రాష్ట్రపతులు వచ్చినా అబ్దుల్ కలాం ని మనం ఎప్పటికీ మరచిపోలేము. రాష్ట్రపతి స్థాయి కి ఒక గొప్ప హోదా ని ఇచ్చిన అబ్దుల్ కలాం చనిపోయే టైమ్ వరకూ ఎవ్వరినీ ఇబ్బందిపెట్టకుండా దేశానికి అత్యంత గొప్ప సేవ చేసి చనిపోయారు.

 

ప్రతీ నిమిషం ప్రజల మంచి కోసం కష్టపడిన అబ్దుల్ కలాం తన హయాం లో ఎప్పుడూ ప్రజలకి మంచి చెయ్యడం మీదనే దృష్టి పెట్టారు. తనని నమ్ముకున్న ప్రతీ దగ్గర , చిన్న మనిషికే ఆఖరి నిమిషం వరకూ సేవ చేశారు . అంతా గొప్ప మనసున్న నేత మనకి కనపడరు. అయితే ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కూడా అదే కోవకి చెందుతారు అని ఆయన చేసే పనులు చూసి చెప్పచ్చు.  కేరళకు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె ఆశ్లే హాల్ కు వివాహాన్ని తలపెట్టింది. జనవరి 7న... అంటే నేడు వివాహాన్ని కొచ్చిలోని  తాజ్‌ హోటల్‌ లో కల్యాణ వేదికను నిశ్చయించుకుని, నెల రోజుల క్రితమే అడ్వాన్స్ లు ఇచ్చారు.

 

 

అదే హోటల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కేరళ పర్యత్న లో భాగంగా బస చెయ్యడానికి అంతా ప్లాన్ జరుగుతోంది. కాబట్టి తమ పెళ్లి తేదీ మార్చుకోవాలని ఆ వధూవరులకి హోటల్ వారు చెప్పారు. 5వ తేదీన వివాహం తేదీని మార్చుకోవాలని ఆశ్లే హాల్ కుటుంబీకులకు హోటల్ యాజమాన్యం సమాచారాన్ని ఇచ్చింది. సడన్ గా పెళ్లి తేదీ మార్చుకోవడం అనేది జరిగే పని కాదు .. అని వారు ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.

 

 

తప్పనిసరిగా పెళ్లి జరగాల్సిందేనని .. అందరికీ కార్డులు కూడా పంచేసాము అని వారు బాధ పడ్డారు. అయితే పెళ్లి కూతురు తెలివిగా రాష్ట్రపతి భవన్‌ కు ట్వీట్ చేసింది . తన వివాహం సజావుగా సాగడానికి సహాయం కావాలని కోరింది. ఈ విషయం గురించి తెలుసుకున్న రామ్ నాథ్, వెంటనే స్పందించారు. తన భద్రతా బలగాలను తగ్గించాలని స్థానిక అధికారులను కోరారు. వెంటనే అధికారులు కూడా తక్షణం స్పందించి ఒక పక్క పెళ్లి ఏర్పాట్లతో పాటు రాష్ట్రపతి కి ఉండాల్సిన బస ని కూడా ఏర్పాటు చేశారు .. వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది .. అంతటి మంచి మనసు అప్పట్లో అబ్దుల్ కలాం కి ఉండేది అనీ ఇప్పుడు మన కొవింద్ కే  ఉంది అని అంటున్నారు విశ్లేషకులు . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: