దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు నలుగురికి ఢిల్లీలోని హౌస్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. జనవరి 22వ తేదీ ఉదయం ఏడు గంటలకు వీరందరినీ ఉరితీయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉరిశిక్షను తీహార్ జైల్లో నలుగురికి ఒకేసారి అమలు చేయబోతున్నారు. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నిర్భయ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. అంతకు ముందు మధ్యాహ్నం వరకు తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయ స్థానం సాయంత్రం 4 45 నిమిషాలకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అత్యాచార ఘటనలో తక్షణమే సత్వర న్యాయం జరగాలని, ఈ మేరకు చట్టాలను మరింత కఠినతరం చేయాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


 ఈ కేసులు మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి అత్యాచారం హత్య నేరం కింద అభియోగాలు నమోదు చేశారు. అయితే వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష అనంతరం విడుదల చేశారు. ప్రస్తుతం అతడు అజ్ఞాత జీవితం బతుకుతున్నాడు. ఇక మరో నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో మిగిలిన నలుగురికి మరణశిక్ష  విధిస్తూ ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్ లో తీర్పు వెలువరించింది. 2014 మార్చిలో ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ 2017లో తీర్పును చెప్పింది. ఈ సందర్భంగా నిందితులు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

అసలు ఏమైంది ?

2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి సమయంలో దక్షిణ ఢిల్లీ లో తన స్నేహితుడితో కలిసి సినిమా నుంచి బయటకు వచ్చిన నిర్భయ, ద్వారకలోని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తుండగా, అదే సమయంలో ఓ ప్రైవేటు బస్సు అక్కడ ఆగింది. ఆమెను ఇంటి వద్ద దిగబెడతామని బస్సులో ఉన్న వారు నమ్మబలికారు.నిర్భయ తో పాటు ఫిజియోథెరపిస్ట్ రవీంద్ర ప్రసాద్ పాండే అనే 23 ఏళ్ల నిర్భయ స్నేహితుడు కూడా ఆ బస్సు ఎక్కాడు. దానిలో డ్రైవర్ తో పాటు ఆరుగురు మగ వాళ్ళు ఉన్నారు. కాసేపటి తర్వాత బస్సు డ్రైవర్ బస్సును దారి మళ్లించారు. దీంతో అనుమానం వచ్చిన నిర్భయ స్నేహితుడు ఇలా ఎందుకు చేస్తున్నారని వారిని ప్రశ్నించగా అతడిని కిందకు నెట్టివేసి ఆ తరువాత వారు కదులుతున్న బస్సులోనే ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ మరణించింది.ప్రస్తుతం మరణశిక్ష పడ్డ వారి వారి పేర్లు ముఖేష్ (30 ), పవన్ గుప్తా (23 ) వినయ్ శర్మ (34 ) అక్షయ్ కుమార్( 31 )

మరింత సమాచారం తెలుసుకోండి: