అడవిలో ఎప్పుడైనా కారుచిచ్చు అంటూకుంది అంటే ఇక అడవి మొత్తం మంటల్లో ఆహుతి కావాల్సిందే. ఇక అడవిలో ఉన్న జంతువులు అన్ని ప్రాణాలు కోల్పోవాల్సిందే . అతి దారుణంగా మంటల్లో ఆహుతి అయి పోతూ ఉంటాయి అడవి జంతువులు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఆస్ట్రేలియాలో.  ఆస్ట్రేలియాలో నెలరోజులుగా బుష్ ఫైర్ కొనసాగుతూనే ఉంది. ఆ మంటలకు ఆస్ట్రేలియాలో  వందల ఎకరాల అటవీ భూమిని నాశనం  అయిపోయింది. ఎన్నో జంతువులు అగ్నికి ఆహుతి అయిపోయాయి . రోజురోజుకూ విస్తరిస్తున్న మంటలతో వందల ఎకరాల అడవి నాశనం అయిపోతుంది. ఈ బుష్ ఫైర్  కారణంగా వేల సంఖ్యలో పశువులు చనిపోయినట్లు తెలుస్తోంది. 

 

 

 

 ఈ బుష్ ఫైర్ లో చనిపోయిన కంగారు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇది  చూసిన వాళ్ళ అందరి హృదయాలను కలచివేస్తోంది. బుష్ ఫైర్  వ్యాపిస్తున్న సమయంలో మంటల  నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది ఓ కంగారు. ఆ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో పెన్సింగ్ దాటే లోపే మంటలకు ఆహుతి అయిపోయింది కంగారు. ఈ ఫోటో చూసి చలించని  వారు ఉండరు. చావు చూడడానికి ఇంత భయంకరంగా ఉంటుంద అని  ఈ ఫోటో చూసిన వారు అనుకుంటున్నారు. చూసేవాళ్ళకే  ఇంత బాధగా ఉంటే మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయిన కంగారు  ఇంకెంతగా విలవిలలాడి పోయిందో అని అందరి హృదయాలను కలచివేస్తుంది ఈ ఫోటో. 

 

 

 

 అయితే బుష్ ఫైర్  నుంచి తప్పించుకునే క్రమంలో పెన్సింగ్  మధ్య చిక్కుకొని ఆహుతి అయి పోయింది ఈ కంగారు. ఇక ఆ తర్వాత అది అలాగే పెన్సింగ్ కి  పట్టుకుని వేలాడుతూ కనిపించింది. ఇకపోతే ఈ మంటల కారణంగా దాదాపు నాలుగువేల పశువులు గొర్రెలు చనిపోయాయి ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే భారీగా వ్యాపించిన మంటల వల్ల ఇప్పటికే న్యూ సౌత్ వేల్స్ లోని సుమారు 30 శాతం అడవి కాలిపోయిందని వోలోన్  గాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు . ఈ మంటల్లో   ఎన్నో భవనాలు కూడా ధ్వంసం అయిపోయాయి. అటవీ ప్రాంతంలో వాతావరణం కలుషితమై బలమైన వేడి గాలులు వీస్తుండడంతో ఈ మంటలు చెలరేగి నట్లు తెలుస్తోంది. ఇకపోతే సోమవారం చల్లని గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురవడంతో మంటలు కాస్త సద్దుమణిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో వారం తర్వాత మళ్లీ మంటలు  చెలరేగే అవకాశం ఉందని అక్కడి అధికారులు స్థానికుల హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: