ఏపీ ని ప్రస్తుత మూడు రాజధానుల వ్యవహారం నిద్రలేకుండా చేస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమని మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోగా.. అమరావతి ప్రాంత రైతులు టీడీపీ నేతలు మాత్రం దానిపై నానా రాద్దాంతం చేస్తూ... రాజధాని అనేది అమరావతి హక్కు అంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించవద్దని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కోరారు. మేరకు లేఖ రాశారు. నాడు కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చించకుండానే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. గెజిట్ లేదా జీవో ద్వారా అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని లేఖలో కోరారు.

 

అయితే ఇప్పుడు ధర్మాన రాసిన లేఖ జగన్ ను ఎంతో సంతోషానికి గురి చేసిందట. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మరీ ఆయనను ప్రశంసించారని సమాచారం. ఒకపక్క విపక్షాలు అతని 3 రాజధానుల నిర్ణయం పై దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఏకంగా ప్రధానికి లేఖ రాయడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం అని జగన్ కొనియాడారు. ఇకపోతే మరికొద్ది గంటల్లో మూడు రాజధాని విషయంపై తుది నిర్ణయం రానున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా వైయస్సార్సీపి పార్టీకి మద్దతు అవసరం అందుకే ధర్మాన చర్య వైసీపీ వర్గాలకు మంచి ఉత్సాహాన్నిచ్చింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: