లోకంలో మనుషులు అని చెప్పుకునే మృగాలు కూడా జీవిస్తున్నాయని ఈ మద్యకాలంలో జరిగే సంఘటనల వల్ల అందరికి తెలుస్తుంది. మనిషి జీవించడానికి డబ్బు అవసరమే. కానీ డబ్బుకోసమే కొందరు బ్రతుకుతున్నారు. ఎందుకంటే డబ్బు మాయలో పడి చేయని పాపాలు ఉండటం లేదు. ఇప్పుడు లోకాన్ని శాసిస్తుంది ఒకటి డబ్బు అయితే, రెండవది కామం. ఈ రెండింటిలో దేనికైనా బానిస అయిన వారి జీవితం ఎంత దారుణంగా మారుతుందంటే మనం తరచుగా వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం.

 

 

ఇకపోతే ఓ వ్యక్తి ఆడపిల్లగా మారి ఆస్తులు సంపాదించగా ఓ నయవంచకుడు మోసం చేసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెగా చెప్పబడే అతని మరణానికి కారణం అయ్యాడు. ఆ వివరాలు తెలుసుకుంటే. సావిత్రి అనే మహిళకు  ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అతని పేరు వేణుగోపాల్. అయితే వేణుగోపాల్ 2016లో ఇంటి నుంచి పారిపోయి, తిరిగి 2018లో శ్రీనందితగా లింగమార్పిడి చేసుకుని వివాహం చేసుకుని సావిత్రి ఇంటికి వచ్చారు. అక్కడ వేణుగోపాల్ ను తామే శ్రీనందితగా మార్చామని, తామిద్దరం ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నామని జాన్ ప్రసాద్ వెల్లడించాడు.

 

 

ప్రస్తుతం యానాంలో ఇద్దరం కలిసి జీవిస్తు, అన్యోన్యంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తీన్‌మార్, రికార్డింగ్ డాన్సులతో నందిత బాగానే సంపాదించిందని, ప్రస్తుతం ఒక ఇల్లు కొనే విషయంలో కొంత డబ్బు సర్దుబాటు చేయాలని కోరగా, సోమానాయుడు, సావిత్రి కూడబెట్టుకున్న రూ. లక్ష ఇచ్చారు. ఇదిలా ఉండగా  కొన్ని అనారోగ్య కారణాల వల్ల నందిత మరణించినట్లు తెలుసుకున్న తల్లి సావిత్రి,  శ్రీనందిత సంపాదించిన ఆస్తులు, తల్లిగా తనకు ఇవ్వమని కోరగా జాన్ ప్రసాద్ తాను ఎలాంటి డబ్బు ఇవ్వబోనని, సావిత్రిపై బెదిరింపులకు దిగాడు.

 

 

దీంతో ఆమె గతేడాది డిసెంబర్ 16న మల్కిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారినుండి స్పందన కరువైందట. ఇలా ఎవరికి చెప్పుకున్న న్యాయం జరగడం లేదని వాపోతుంది.  అయితే వేణుగోపాల్‌ను ట్రాన్స్‌జెండర్‌గా మార్చి, సరైన వైద్యం చేయించకుండా మరణానికి కారణమైన వారిని శిక్షించాలని, అలాగే తన కుమారుడి (శ్రీనందిత) సంపాదన తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని సావిత్రి కోరింది. దీనిపై మల్కిపురం ఎస్ఐను వివరణ కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: