భారతదేశ రెండో ప్రధానమంత్రి, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో ఒకరు లాల్ బహాదుర్ శాస్త్రి గారు. భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు.

 

ఎంతో దేశభక్తిగల ఆయన 1921లో సహాయ నిరాకరణోద్యమంలో అడుగుపెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో మొత్తం 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. స్వాతంత్య్రం అనంతరం ఉత్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసి ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.



మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్‌లాట్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది.జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు.

 

దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు. అజాత శత్రువనీ, పొట్టివాడైనా గట్టివాడేనని ఋజువు చేసుకున్నారు. పదవులే ఆయనను వరించి వచ్చాయిగానీ, ఆయన ఎన్నడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. ప్రధానమంత్రిగా నున్నా పట్టుమని పదిరూపాయలు వెనుక వేసుకొనని నిస్వార్థపరుడు. ఆయన చిత్తశుద్ధీ, నిజాయితీ, సేవాభావాలు ఆదర్శవంతమైనవి. అందుకే ఆయన జీవిత చరిత్ర మిక్కిలి ఆదర్శప్రాయం.

 

తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన రోజున 02:00 గంటలకు అతను తాష్కెంట్ లో గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడినది. కానీ ప్రజలు మరణం వెనుక కుట్ర ఆరోపించారు.అతను విదేశంలో చనిపోయిన భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతనిని జాతీయ నాయకునిగా శ్లాఘిస్తూ అతని జ్ఞాపకార్థం విజయఘాట్ లో స్మారకం ఏర్పాటు చేసారు.మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: