తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న  విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే సన్నద్ధ మవుతున్నాయి. ఇకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎలా నోటిఫికేషన్ ఇస్తారంటు  తెలంగాణ కాంగ్రెస్ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై  రెండు రోజులపాటు  విచారణ జరిపింది. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఈ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. 

 

 

 దీంతో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు అయింది. ఇకపోతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి అన్ని పార్టీలు పావులు కదుపుతూ విజయం కోసం తహతహలాడుతున్నాయి . మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి గ్రౌండ్ లెవల్ లో పార్టీ క్యాడర్ను పెంచుకోవాలని విపక్ష పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.  అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలి అంటు గులాబీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలకు ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో  మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. 

 

 

 ఇక అన్ని పార్టీలు ఎవరికి వారు ఈ విషయంపై ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు బాగానే కలిసొచ్చేలా  కనిపిస్తుంది ఎందుకంటే టీఆర్ఎస్ కు  గట్టి పోటీ ఇచ్చే  ప్రతిపక్షమే లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశం  టిఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే భారీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు టిఆర్ఎస్ అధినేత కూడా మంత్రులందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏ ఒక్క చోట మున్సిపాలిటీ కార్పొరేషన్ ఓడినా... మంత్రి పదవులు  ఊడిపోతాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: