తనకు ఈ పరిస్ధితి వస్తుందని  చంద్రబాబునాయుడు ఏమాత్రం ఊహించుండరు. తాను దేశంలోనే అత్యంత సీనియర్ నేతనని చెప్పుకునే చంద్రబాబు గడచిన 20 రోజులుగా గ్రామస్ధాయికే పరిమితమైపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదన దెబ్బకు రాజధాని అమరావతి ప్రాంతంలోని ఓ ఐదారు గ్రామాల్లోనే తిరుగుతున్నారు.

 

 ఢిల్లీ స్ధాయిలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబును జగన్  ఇపుడు గ్రామస్ధాయికే పరిమితం చేసేశారు.  రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల రైతులు భూమిలిస్తే ఇపుడు ఆందోళనలు జరుగుతున్నది మాత్రం కేవలం ఓ ఐదారు గ్రామాల్లోనే కావటం గమనార్హం. ఉదయం లేవగానే రెడీ అయిపోయి మందడం, ఉద్దండరాయునిపాలెం, ఎర్రుబాలెం, ఉండవల్లి గ్రామాలకు వచ్చేస్తున్నారు చంద్రబాబు.

 

స్ధానికులను, రైతులను రెచ్చగొడుతు పై గ్రామాల్లోనే సాయంత్రం వరకూ తిరుగుతూ తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోవటమే చంద్రబాబు డ్యూటిగా మారిపోయింది. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల ఏర్పాటు చేయచ్చని ప్రకటించారో అప్పటి నుండే చంద్రబాబు అదృష్టం తిరగబడిందనే చెప్పాలి. అంతకుముందు వరకూ  వరుసగా చంద్రబాబు జిల్లాల పర్యటనలతో బిజిగా ఉన్న విషయం తెలిసిందే.

 

తిరిగితే జిల్లాల్లో తిరగటం లేకపోతే పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు పెట్టడం, అదీ కాకపోతే నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడటం లాంటి యాక్టివిటీస్ తో చంద్రబాబు చాలా బిజీగా ఉండేవారు. అలాంటిది గడచిన 20 రోజులుగా ఆ పనులన్నింటినీ పక్కనపడేసి కేవలం గ్రామాలను పట్టుకుని తిరుగుతున్నారు. తాను చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా నిలబడమని మిగిలిన గ్రామాల్లోని జనాలను అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.

 

తాను ఎంతగా బతిమలాడుకుంటున్నా జనాలు రాకపోవటం ఓ సమస్య అయితే ఇటు పార్టీ నేతలు కూడా తమ జిల్లాల నుండి అమరావతి ప్రాంతానికి రాకపోవటం చంద్రబాబుకు మరింత షాకుగా మారింది. మొత్తం మీద ఢిల్లీ స్ధాయి నుండి ఒక్కసారిగా గ్రామ స్ధాయికి పడిపోతుందని చంద్రబాబు ఏ రోజు కూడా ఊహించుండరు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: