రాజధాని అమరావతి తరలింపు వివాదం కీలక మలుపు తిరిగింది. గుంటూరు జిల్లాలోని మాచర్ల ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇదే విషయమై పార్టీలో ఇపుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాజధాని తరలింపును అడ్డుకునేందుకు పల్నాడు వైసిపి ఎంఎల్ఏలపై హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.

 

గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఏకంగా 15 నియోజకవర్గాల్లో గెలిచింది. తర్వాత మారిన పరిస్దితుల్లో  రాజధానిని జిల్లాలోనే ఉన్న అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. జగన్ ప్రతిపాదనతో అమరావతి ప్రాంతంలోని ఓ ఐదారు గ్రామాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీనికి చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు నేతృత్వం వహిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఒకవైపు రాజధాని తరలింపు ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే టిడిపి ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్  టిడిపితో సంబంధాలను తెంచుకున్నారు. ఇందులో భాగంగానే గిరి సిఎంను కలిశారు. ఇటువంటి ఘటనలతో టిడిపి నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. దాంతో  జగన్ కు వ్యతరేకంగా ఆందోళనలను తారస్ధాయికి తీసుకెళ్ళాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు అనుమానంగా ఉంది. ఇందులో భాగంగానే  వైసిపి ఎంఎల్ఏపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయటం.

 

ఇదే విషయమై వైసిపి ఎంఎల్ఏ సుధాకర్ బాబు మాట్లాడుతూ పల్నాడు వైసిపి ఎంఎల్ఏల హత్యకు చంద్రబాబు కుట్ర పన్నినట్లు ఆరోపించటం గమనార్హం. మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి హత్యాయత్నంతో పాటు మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి   శ్రీదేవి పైన కూడా హత్యాయత్నం చేస్తారేమో అంటూ సుధాకర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.  

 

చూడబోతే వైసిపి ఎంఎల్ఏలను హత్య చేసి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చంద్రబాబు కుట్ర పన్నినట్లు మండిపడ్డారు. మొన్న జర్నలిస్టులపై జరిగిన దాడి కూడా ఇందులో భాగమే అన్నారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో పామర్రు ఎంఎల్ఏ కైలే అనీల్ కుమార్ పైన కూడా దాడి జరిగింది.  అంటే వైసిపి నేతల ఆరోపణలు చూస్తుంటే ఎంఎల్ఏల హత్యకు పెద్ద కుట్ర జరిగినట్లే అనుమానంగా ఉంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: