ఎంత కిరాతంగా చంపారు ఈ మృగాళ్లు. వీళ్ళని మృగాళ్లు తో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయేమో. అంత నీచులు ఈ దుష్టులు. ఎన్నో ఏళ్ల తరువాత ఎట్టకేలకు వీళ్లకు ఉరిశిక్ష అమలు కాబోతుందంటే ప్రజలంతా ఆనందపడుతున్నారు. నలుగురికి ఒకేసారి ఉరి అనే ఐడియా ఇంకా బాగుందని కొనియాడుతున్నారు. 85నెలలు ఆలస్యమైనా వాళ్ళని ఉరి తీస్తున్నారన్న గుడ్ న్యూస్ అందరికి తృప్తినిస్తుంది. జనవరి 22న ఏడు గంటలకు ఈ పిశాచులకు మృత్యు గంటల మొదలవుతాయి. అయితే, ఇదే రోజున సిఎఎ యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సుప్రీంకోర్టు విచారించబోతుంది. నెటిజన్లు ప్రకారం, 22న దోషులను ఉరితీస్తూ ప్రజల దృష్టిని మళ్లించి... మరొక వైపు సుప్రీంకోర్టు సిఎఎను సమర్థించబోతోందని చెబుతున్నారు.

 

ఏదేమైనా నిర్భయ తల్లిదండ్రులు ఆశా దేవి, బద్రీనాథ్ సింగ్ తన బిడ్డకు 22న న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాపం, ఆ అమ్మ తన బిడ్డకు న్యాయం జరగాలని ఎన్నిసార్లు ఏడ్చిందో అందరికి తెలుసు.


ఈ రోజు తో ఆమె కళ్ళకి విశ్రాంతి దొరికిందని ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. డెత్ వారెంట్లు జారీ అవ్వడంతో ఆమె చాలా సంతోషపడుతూ..'నా బిడ్డకు న్యాయం జరుగుతుంది. ఈ నలుగురిని ఉరి తీస్తుండటంతో దేశంలోని మహిళలకు తమ పనులు తాము చేసుకోవడానికి, బయటకు వెళ్ళడానికి దైర్యం వస్తుంది. ఎందుకంటే, ఈ మృగాళ్లకు ఉరితీస్తే బయట కామాంధులు తప్పుచేయడానికి భయపడతారు. అలాగే, ఈ నిర్ణయం దేశ ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం నింపుతుంది.' అని ఆమె అన్నారు.


నిర్భయ తండ్రి మాట్లాడుతూ... 'కోర్టు తీర్పుతో నేను సంతోషపడుతున్నాను. ఈ నిర్ణయం నేరం చేసే వారిలో భయం కలిగిస్తుంది.' అని చెప్పారు.


ఇంకా, ప్రముఖులు మాట్లాడుతూ కోర్టు కేవలం మరణశిక్ష మాత్రమే విధించలేదు... ఇటువంటి మృగాళ్లను క్షమించేదే లేదనే మెసేజ్ ని చెప్పకనే చెబుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: