2012 సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు రాక్షసులు కలిసి 23 ఏళ్ల యువతిపై అతి దారుణంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు వ్యక్తులు 23 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఆమె  మర్మాంగాల్లోకి  పదునైన వస్తువులు జొప్పించటంతో  తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మహిళలపై అత్యాచారాలు చేస్తే శిక్షించడానికి ఏకంగా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇకపోతే నిర్భయ కేసులోని ఆరుగురు నిందితులలో  ఓ నిందితుడు మైనర్ కావడంతో వల్ల మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇక మరో నిందితుడు జైల్లోనే ఉరివేసుకొని చనిపోవడం తో మరో నలుగురు నిందితులకు తాజాగా ఉరి శిక్ష విధించింది సుప్రీంకోర్టు. 

 

 

 ఈ ఘటనలో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. అయితే ఎన్నో రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చిన నిర్భయ కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఓ యువతిపై అత్యాచారం జరిగితే ప్రత్యేక చట్టం తీసుకు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు నిందితులకు శిక్ష పడకుండా ఉండటం పై దేశ ప్రజలందరూ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సుప్రీంకోర్టు నిర్భయ  కేసులోని నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కోర్టు తీర్పుపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. ఇకపోతే దిశ కేసులోని మైనర్ నిందితుడు ప్రస్తుతం జైలు శిక్ష పూర్తి చేసుకొని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. 

 

 

 నిర్భయ కేసులోని మైనర్  నిందితుడికి సుప్రీం కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో 2015 డిసెంబర్ 20న నిర్భయ కేసులో మైనర్  నిందితుడికి మూడేళ్ల శిక్ష పూర్తి కావడంతో విడుదలయ్యాడు. ప్రస్తుతం అతని వయస్సు 24 సంవత్సరాలు. కాగా  అతని పేరు మార్చి దక్షిణ భారతదేశంలోని ఒక ధాబాలో  వంటవాడిగా పెట్టినట్లు సమాచారం. అతని బాధ్యతను ఎన్జీవోకి  అప్పగించగా ప్రస్తుతం వంటవాడిగా సాధారణ జీవితం గడుపుతుంటాడు నిర్భయ కేసులో మైనర్ నిందితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: