ఈ మధ్యకాలంలో పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఎక్కడపడితే అక్కడ దోమల బెడద మరీ పెరిగిపోతోంది. దోమలు వల్ల ఎన్నో రోగాలు వ్యాప్తి చెందుతాయని తెలిసినప్పటికీ... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దోమల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు. మరోవైపు  దోమల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో కాయిల్స్  వాడినప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు మనపై ప్రతాపాన్ని చూపుతోనే  ఉంటాయి దోమలు . ఇక రోజురోజుకు దోమల సైజ్  కూడా బాగా పెరిగిపోతుంది. హాయిగా నిద్రపోతున్న సమయంలో దోమలు కుట్టి మంచి నిద్రను పాడు చేసిన ఘటనలు ఎన్నో .ఇక  దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి రాత్రంతా జాగారమే . 

 

 

 

 అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ చూసినా దోమల బెడద మరీ ఎక్కువ అయిపోతుంది. ఇక ప్రస్తుతం శీతాకాలంలో ఈ దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా దోమలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇక మనిషి  కనిపిస్తేచాలు కుట్టి రక్తం పీల్చేస్తూ ఉంటాయి. అయితే దోమల నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో దోమలు మాత్రం తగ్గించడం కుదరదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమల బారిన పడక తప్పదు. ఇక మరీ ఎక్కువగా దోమలు కుట్టినప్పుడు విష జ్వరాల బారినపడి హాస్పిటల్లా  చుట్టూ తిరుగక తప్పదు. దీంతో ఈ దోమల బెడద కి పూర్తిస్థాయి నివారణ దొరికితే బాగుండు దేవుడా  అని మొక్కుకొని వాళ్ళు ఉండరు. 

 

 

 

 ఇకపోతే రోజు ఎన్నోసార్లు దోమలు కొడుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే దోమలు ఒక్క రాత్రిలో ఎన్నిసార్లు కొడతాయో  తెలుసా.. ఆ ఎన్నిసార్లు కుడతాయండి  ఒక పది పదిహేను సార్లు కుడుతాయి అంటారా... అలా అనుకుంటే పొరపాటే... దోమలు ఒక్కరాత్రిలో ఒకే మనిషిని రెండు వందల నలభై సార్లు కు పైగా కుడతాయట. ఇది తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ఏదో అప్పుడప్పుడు కాస్త లెక్క తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం అయితే ఒక్క రాత్రిలోనే ఒక మనిషిని దోమ 240 సార్లు కుడుతుందట. వామ్మో రెండు వందల నలభై సార్ల అంటారా... పడుకునే ఉంటాం కాబట్టి దోమ ఎన్నిసార్లు కొడుతుందో అంతలా పట్టించుకోము కదా దీంతో  దాని పని అది కానిస్తుంది. అందుకే  దోమల బెడద ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: